యాంకర్ సుమకు చిరంజీవి బంపర్ ఆఫర్.. లండన్‌లో మెగాస్టార్‌తో!
యాంకర్ సుమ అంటే మాటల కోట. ఈవెంట్‌లో ఆమె తన మాటల గారడితో అందర్నీ చిత్తు చేయడమే కాకుండా స్టార్ హీరోలను, యాక్టర్లను ఆటపట్టిస్తూ హంగామా చేస్తుంటుంది. యాంకర్ సుమ ఉందంటే వేదిక సందడిగా మారిపోవాల్సిందే. అలాంటి యాంకర్ సుమను ఆటపట్టించడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఇటీవల ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి టాప్ యాంకర్‌ను ఆటపట్టించడం హైలెట్ అయింది. మెగాస్టార్ తనదైన శైలిలో ఆమెతో టీజ్ చేయడం ఈవెంట్‌లో అందర్నీ ఆకర్షించింది. ఈ వారిద్దరి సంభాషణకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సుమను చిరు ఎలా ఆటపట్టించారనే వివరాల్లోకి వెళితే..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన స్పీచ్‌తో సినీ అభిమానులను ఆకట్టుకొన్నారు. హీరోల మధ్య విభేదాలు ఉండవు. అభిమానుల ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. అలాగే విశ్వక్ సేన్‌కు నందమూరి హీరోలంటే ఇష్టం. అలాంటి ఇష్టం ఉండటంలో తప్పులేదు. విశ్వక్ సేన్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మెగాస్టార్ వివరించారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి తన స్పీచ్ ముగించిన తర్వాత సుమతో సరదాగా సంభాషణలోకి దిగారు. అందరిపై సెటైర్లు వేసే సుమను చిరంజీవి ఆటపట్టించేందుకు ప్రయత్నించారు. స్పీచ్ ముగిస్తుండగా సుమ పరుగెత్తుకొంటూ చిరంజీవి వద్దకు వెళ్లింది. దాంతో ఒక్కసారిగా ఆయన కంగారు పడ్డారు. ఏంటి? అలా పరుగెత్తుకొంటూ వస్తే.. ఏమైందేమోనని షాక్ అయ్యాను అంటూ కామెంట్ చేశారు.
ఆ తర్వాత సుమ మాట్లాడుతూ.. మీ పెద్ద మనసుకు, అలాగే మీరు మాట్లాడిన మాటలకు, మీ నడవడికకు కూడా మేమందరం ఫ్యాన్స్. మీరు మాకు అన్ని రకాల ఇన్సిపిరేషన్ అంటూ ప్రశంసలు గుప్పించడంతో.. మీరు అంతేసి మాటలు అనకండి.. మీలో ఒకడిగా ఉంచండి. మీ నుంచి దూరం చేయకండి అంటూ సమతో చిరంజీవి అన్నారు. దాంతో మీరు మాలో ఒకరే అని సమాధానం ఇచ్చింది.
అనంతరం ఏదో మాట్లాడబోయి.. నేను లీకు చేస్తున్నానా? బాబోయ్.. లండన్‌లో అంటూ చిరంజీవి ఏదో చెప్పబోయారు. దాంతో సుమ లండన్ ఏమిటి? అని అడిగితే.. మీరు లండన్ దాకా రాగలవా? అక్కడ ఓ ఈవెంట్ చేయాలి..మీరు వస్తారా? అని చిరు అడిగారు. దాంతో నేను వస్తాను అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో నాకు లండన్‌లో సన్మానం జరుగుతుంది. మీరు వస్తే బాగుంటుంది అని అన్నారు. దాంతో నేను తప్పకుండా వస్తాను. ఎప్పుడో చెబితే రెక్కలు కట్టుకొని వస్తాను అని సుమ బదులిచ్చింది. దాంతో రెక్కలు కాదు.. ఫ్లయిట్‌లోనే రావోచ్చు. కానీ ఆ ఫ్లయిట్ చార్జీలు మీరే పెట్టుకోవాలి అని చిరంజీవి ఆటపట్టించారు. అలా సుమ, చిరంజీవ మధ్య సరదా సంభాషణ సాగింది.


Click it and Unblock the Notifications











