పులిహోర కలుపుతున్నా.. వచ్చేస్తారా? అంటోన్న సుమ
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతోన్న యాంకర్ సుమ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అవుతోంది. ఈ మధ్య సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతున్న వారిలో సుమ కూడా ముందు వరుసలో ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి అక్కడా అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ సుమ దూసుకుపోతోంది.
సోషల్ మీడియాలో ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన సుమ.. తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలెన్నో అభిమానులతో పంచుకుంటోంది. తన ఇంటికి సంబంధించిన విశేషాలు చెబుతూ.. ఖాళీ సమయాల్లో తాను ఏం చేస్తూ ఉంటుందో అందరికీ చూపిస్తూ ఉంటుంది. తన అభిమానులకు ఇవ్వాల్సిన సందేశాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఇచ్చేస్తోంది.

తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా.. పులిహోర కలుపుతున్నానని తెలిపిందే. తినడానికి వచ్చేస్తారా? అని అభిమానులను అడిగింది.. అయితే ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా ఉండండి అంటూ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











