అమ్మ బాబోయ్ ఏం ప్లాన్ వేశారు.. జబర్దస్త్‌లోకి సుమ.. అది కూడా ఆ ప్రోగ్రాంతో!!

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, స్టార్ మహిళా, ఢీ, క్యాష్ ఇలా షోలు ఎంతగా ఫేమస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రాంలో దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అయితే మొదటి సారిగా ఎక్స్ ట్రా జబర్దస్త్‌లోకి స్టార్ మహిళ వచ్చింది. సుమ నేరుగా జబర్దస్త్ స్టేజ్‌లోకి రాలేదు. కానీ కెవ్వు కార్తీక్ స్కిట్‌ను అలా ప్లాన్ చేశాడు. ఇక సుమ కూడా తనదైన శైలిలో పంచులు వేసేసరికి స్కిట్ బాగానే వచ్చేలా ఉంది. అసలు కథ ఏంటంటే..

కెవ్వు కార్తీక్ స్కిట్స్..

కెవ్వు కార్తీక్ స్కిట్స్..

అవినాష్ బిగ్ బాస్ షోలోకి వెళ్లాక కార్తీక్ ఒంటరిగానే టీంను లీడ్ చేయాల్సి వస్తోంది. అవినాష్ అలా వెళ్లిపోయాక తానే టీం లీడర్ తానే అంతా అని ప్రొజెక్ట్ చేసుకునేలా ఓ స్కిట్ కూడా వేశాడు. అందులో పంచ్‌లు కూడా బాగానే పేలాయి. అవినాష్ లేకపోయినా కార్తీక్ తన స్కిట్స్‌ను బాగానే రాసుకుంటున్నాడు.

 తాజాగా అలా..

తాజాగా అలా..

ఇమ్మాన్యుయేల్‌తో కలిసి చేస్తోన్న ఈ స్కిట్ ప్రోమోలో బాగానే వైరల్ అయింది. ఇందులో సుమ, స్టార్ మహిళను యాడ్ చేయాలన్న ఆలోచన బాగానే ప్లస్ అయినట్టు కనిపిస్తోంది. జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతో మంది మెరిశారు కానీ సుమ మాత్రం ఇంత వరకు ఆ స్టేజ్ ఎక్కలేదు. అందులో కనిపించనూ లేదు.

స్టార్ మహిళతో..

స్టార్ మహిళతో..

స్టార్ మహిళ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేలా స్కిట్‌ను రాసుకున్నాడు. భార్య వేషంలో ఉన్న ఇమ్మాన్యుయేలో కార్తీక్‌ను కొట్టుకుంటూ స్టార్ మహిళ ప్రోగ్రాంకు తీసుకెళ్లింది. అలా వెళ్లి సుమ కాళ్లపై పడతాడు. ఆశీర్వాదం కావాలంటే ఇస్తా కదా ఇలా పడటం ఎందుకని సెటైర్ వేస్తుంది.

అక్కడకు వెళ్లగానే..

అక్కడకు వెళ్లగానే..

ఏంటి నీ సమస్య అని కార్తీక్‌ను సుమ ప్రశ్నించడం.. నా భార్యే నా సమస్య అంటూ కార్తీక్ కౌంటర్ వేయడంతో సుమ రోజాకు సిగ్నల్ ఇస్తుంది. భార్యాభర్తల సమస్య అంటూ రోజా బతుకు జట్కా బండి, రచ్చ బండ కార్యక్రమాలను గుర్తు చేసింది.

Recommended Video

Anchor Suma Kanakala In Allu Arjun's Movie, Pushpa Unit Reacts
రష్మీ కౌంటర్..

రష్మీ కౌంటర్..

ఇక ఆ తరువాత రష్మీ కూడా స్టార్ మహిళ సెట్‌లోకి వచ్చేసింది. స్టార్ మహిళ యాంకరింగ్ కూడా కొట్టేయాలన్న ఆశను బయటపెట్టింది రష్మీ. కూర్చోవచ్చు కదా సుమ గారు.. ఎప్పుడూ నిల్చోనే ఉంటారా? అంటూ నైస్‌గా రష్మీ కవర్ చేసింది. గ్యాప్ ఇస్తే మీరు ఎక్కడ వస్తారో అని నిల్చునే ఉంటున్నాని సుమ రివర్స్ కౌంటర్ వేసింది. ఇలా మొత్తానికి ఎక్స్ ట్రా జబర్దస్త్, స్టార్ మహిళను షోను కలిపేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X