Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
బుల్లితెరపై ప్రస్తుతం సుమ ఎంత బిజీగా ఉంటుందో.. ఉందో అందరికీ తెలిసిందే. బుల్లితెర షోలే కాకుండా.. సినిమా ఈవెంట్లతోనూ ఫుల్ బిజీగా ఉంటోంది. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్‌లోనూ నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క తనయుడి సినిమా పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. ఇలా ఇన్ని పనులతో బిజీగా ఉన్న సుమ.. తాజాగా మరో షోను కూడా హోస్ట్ చేసేందుకు సిద్దమైంది.
అలా వచ్చిన షో..
స్టార్ మా చానెల్లో ఎక్కువగా కామెడీ షోలు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే షోలు ఉండవు. ఉండేది ఒకే ఒక్క బిగ్ బాస్ షో. అది మహా అంటే మూడు నాలుగు నెలలు ఉంటుంది. అందుకే అలా దాని తరువాత ఏంటి అనే క్రమంలోనే స్టార్ట్ మ్యూజిక్ అనే షో వచ్చింది. సెలెబ్రిటీలను పట్టుకొచ్చి వారితో ఆటలు ఆడిస్తుంటారు.
అప్పుడు ఝాన్సీ..
అలా సెలెబ్రిటీలో ఆటలు ఆడించే స్టార్ట్ మ్యూజిక్ షోను మొదటగా ఝాన్సీ నడిపించింది. కానీ అది అంతగా వర్కవుట్ కాలేదు. సెలెబ్రిటీలను అయితే పట్టుకొచ్చారు. ఆడించారు.. పాడించారు. కానీ షో మాత్రం హిట్ కాలేకపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే ఈ షో దారుణంగా బెడిసి కొట్టేసింది.
శ్రీముఖి చేతుల్లోకి..
బిగ్ బాస్ మూడో సీజన్ తరువాత శ్రీముఖికి స్టార్ట్ మ్యూజిక్ షోను అప్పగించారు. కాస్త మార్పులు చేర్పులు చేసి గ్రాండ్‌గా రీ లాంచ్ చేశారు. స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ శ్రీముఖి చేసిన ప్రయత్నం కూడా వర్కవుట్ కాలేదు. అలా శ్రీముఖి కూడా షోను నిలబెట్టలేకపోయింది.
ప్రస్తుతం సుమపై భారం..
ఇక ఇప్పుడు ఆ షో భారాన్ని సుమపై మోశారు. స్టార్ట్ మ్యూజిక్ షోను పైకి లేపేందుకు సక్సెస్ చేసి టీఆర్పీలు తెచ్చేందుకు సుమను పట్టుకొచ్చారు. ఒకప్పుడు సుమ స్టార్ మాలో భలే చాన్సులే వంటి ఎంటర్టైన్మెంట్ షోలను హెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఈ స్టార్ట్ మ్యూజిక్ షోను నిలబెడుతుందా లేదా? చూడాలి.
ప్రోమో వైరల్..
అయితే తాజాగా సుమ స్టార్ట్ మ్యూజిక్ షో ప్రోమోను వదిలారు. ఇందులో కార్తీక దీపం ఫ్యామిలీ, బిగ్ బాస్ కంటెస్టెంట్లు చేసిన రచ్చ కనిపిస్తోంది. మరి సుమ తనదైన శైలిలో హోస్ట్ చేసి ఈ షోను కూడా టాప్ ప్లేస్‌లో నిలబెడుతుందా? లేదా? అన్నది చూడాలి.