బిగ్‌బాస్‌లో సుమ హంగామా.. కేక పెట్టించే డైలాగ్స్‌తో
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో తుది అంకానికి చేరుకొన్నది. మరో వారం రోజుల్లో విజేత ఎవరో తెలిపోనున్నది. ఇప్పటికే ఐదుగురు టాప్ ఫైనలిస్టుల జాబితా ఖరారైంది. రాహుల్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్ టాప్ 5లో నిలిచారు. ఈ క్రమంలో ఇంటిలో సభ్యుల హంగామా, పోటీతత్వం బయటకు వస్తున్నది. అంతేకాకుండా అతిథుల తాకిడి కూడా పెరిగింది. ఆదివారం ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్‌తో కూడిన మీకు మాత్రమే చెబుతా చిత్ర బృందం సందడి చేసింది. ఇక సోమవారం ఇంటిలోకి తన F3 షోను ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్లోకి యాంకర్ సుమ ప్రవేశించింది.
బిగ్‌బాస్ టీమ్ రిలీజ్ చేసిన ప్రమోలో యాంకర్ సుమ ఇంట్లో హల్‌చల్ చేయడమే కాకుండా ఇంటి సభ్యులను నవ్వుల్లో ముంచెత్తింది. తాను F3 షోలో చేపట్టే టాస్కులను ఇంటి సభ్యులతో ఆడించింది. అవి ఇంటి సభ్యుల్లో జోష్ పెంచింది.

ప్రోమోలో కనిపించిన ప్రకారం.. బెడ్ మీద సుమ పడుకొని ఉంటే కుక్కులు మొరగడం కనిపించింది. అంతలో సుమను చూసి బాబా భాస్కర్‌ను చూసి అక్క అంటే.. ఏంటి నీకు అక్కనా అంటూ దబాయించింది.
అలాగే ఇంటి సభ్యుల తలకు హెడ్‌ఫోన్ పెట్టించి.. తాను చెప్పే డైలాగ్స్‌ను గుర్తించే పనిలో పడింది. అందులో భాగంగా చంకలో పిల్లిని పెట్టుకొని.. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా?.. లక్ష్య భక్షములు భక్షించుట లక్ష్మయ్యకు సాధ్యమా? బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జీగా బజ్జున్నాడు అంటూ డైలాగ్స్ హాస్యాన్ని పండించింది. ఇక ఫుల్ ఎపిసోడ్‌లో ఇలాంటి సీన్లు ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.
అలాగే బిగ్‌బాస్ తెలుగు షో ఎప్పటిలా 9.30 గంటలకు కాకుండా సోమవారం నుంచి 10 గంటలకు ప్రారంభమవుతుంది. బుల్లితెర ప్రేక్షకులు ఇది గమనించాల్సిందిగా స్టార్ మా కోరింది.


Click it and Unblock the Notifications











