Anchor Suma: ఈ మధ్య నన్ను అందరూ అలానే చూస్తున్నారు.. ఎన్టీఆర్‌కు సుమ కౌంటర్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా గుర్తింపు అందుకున్న వారిలో సుమ ఒకరు. ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ తో ఆకట్టుకుంటే ఎప్పటినుంచో సుమ మాత్రం కేవలం తన మాటలతోనే జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అయితే కాంట్రవర్సీ అయ్యేవిధంగా సుమ ఎన్నడూ కూడా మాట్లాడింది లేదు. అయితే ఆ మధ్య ఎన్టీఆర్ మాత్రం సుమపై కోపంగా చూడడం బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే సుమ ఆ విషయంలో మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత కౌంటర్ ఇచ్చే విధంగా కామెంట్ చేయడం కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ స్థాయిలో క్రేజ్
టెలివిజన్ ప్రపంచంలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా అందులో సుమకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని చెప్పవచ్చు. అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న యాంకర్స్ లలో కూడా ఆమె టాప్ లిస్టులోనే ఉంటుంది. ఎలాంటి షో చేసినా కూడా సక్సెస్ కావాల్సిందే. అలాగే ఎలాంటి ఫ్రీ రిలీజ్ ఎవెబ్ట్ చేసిన కూడా అందులో ఉండాల్సిందే.. అనే విధంగా ఆమె గుర్తింపును అందుకుంది.

కాంట్రవర్సీలకు వెళ్లకుండా
చాలామంది స్టార్ హీరోలు దర్శకులు నిర్మాతలు వారి సినిమా ఈవెంట్స్ కు సుమను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మంచి డిమాండ్ ఏర్పరచుకున్న సుమ అంటే ప్రేక్షకుల్లో కూడా ఒక పాజిటివ్ ఆలోచన విధానం ఉంది. అయితే ఆమె పెద్దగా కాంట్రవర్సీలో నిలిచిన సందర్భాలు అయితే లేవు. ఎప్పుడో కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా చేసింది లేదు.

ఎన్టీఆర్ సీరియస్
అయితే సుమ కొన్ని రోజుల క్రితం ఆమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన విధానంపై మాత్రం ఎన్టీఆర్ చాలా సీరియస్ గా చూడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నాము అని అక్కడ మాట్లాడడంతో ఎన్టీఆర్ చాలా సీరియస్ అయిపోయాడు. ఫ్యాన్స్ అడక్కపోయినా కూడా నువ్వు చెప్పేలా ఉన్నావు అంటూ చాలా కోపంగా చూడడంతో అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

రానా నాయుడు ఇంటర్వ్యూలో
అయితే ఆ వీడియో వైరల్ అయినప్పుడు సుమ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ వెంటనే తన పని తాను సైలెంట్ గా చేసుకుంది. ఇక మళ్ళీ చాలాకాలం తర్వాత ఆమె ఎన్టీఆర్ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చినట్లుగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల వెంకటేష్ రానా నటించిన రానా నాయుడు ప్రెస్ మీట్ లో పాల్గొన్న సుమ ఊహించని విధంగా ఒక కామెంట్ చేసింది.

ఎన్టీఆర్ కు కౌంటర్?
రానా నాయుడు సినిమాలో వెంకీ కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నా పాత్రలో కనిపిస్తున్నాడు. కాబట్టి కాస్త విలన్ తరహాలో సీరియస్ లుక్స్ లో చూడాల్సిందిగా సుమ రిక్వెస్ట్ చేసింది. అయితే వెంకీ కూడా అలానే సీరియస్ గా చూశాడు. ఈ మాత్రం చాలు. ఇక రేపటికి చాలా థంబ్ నెయిల్స్ వస్తాయి. అందరూ నన్ను ఇలానే చూస్తున్నారు ఈమధ్య.. అంటూ ఆమె ఎన్టీఆర్ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చినట్లు అర్థమయిపోయింది. ఇక ఆ వీడియో పై సోషల్ మీడియాలో ఓ వర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి కొంతమంది సుమాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











