కిటికీలోంచి దూకి మరీ.. స్టార్ యాంకర్‌కు ఎంతటి కష్టం వచ్చిందో.. వీడియో వైరల్
తెలుగునాట యాంకరింగ్‌కు కొత్త అర్థాన్ని, అందాన్ని తీసుకొచ్చింది సుమ కనకాల. జనరేషన్స్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుంచి పండు ముసలోళ్ల వరకు అందరూ సుమ ఫ్యాన్సే. ఏ ఈవెంట్ చూసినా, ఈ కొత్త షో మొదలైనా, ఏ చానెల్ అయినా అది సుమ సొంతమే. రోజూ క్షణం తీరిక లేకుండా ఉండే సుమకు కూడా ఎన్నో కష్టాలున్నాయి. అందులో తాజాగా ఓ వింత కష్టం మాత్రం నెటిజన్ల కంట పడింది. దాని సంగతేంటో ఓ సారి చూద్దాం.

బిజీ యాంకర్..
టాలీవుడ్‌లోనే కాదు.. టోటల్ సౌతిండియాలోనే సుమ అంత బిజీగా ఉండే మరో యాంకర్ ఉండరేమో. బుల్లితెరపైన తన పంచ్‌లతో కామెడీ టైమింగ్‌తో దూసుకుపోతుంది. సుమ కామెడీ టైమింగ్‌కు ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. తెలుగులో అనర్గళంగా మాట్లడటమే ఆమె బలం. ఆమె మాటల ధాటికి ఎవ్వరూ నిలవలేరు. అందుకే తెలుగు నాట ఇంత బిజీగా ఉండే యాంకర్‌గా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

ఎంత మంది పోటీగా వచ్చినా..
యాంకరింగ్‌లో ఎంత మంది పోటీగా వచ్చినా.. గ్లామర్‌ను ఒలకబోస్తూ అందాల ఆరబోత చేసినా సుమను మాత్రం ఢీకొట్టలేకపోతున్నారు. అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ వంటి వారెందరు వచ్చినా వస్తున్నా.. సుమ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరడం లేదు.

ఈవెంట్ ఏదైనా సరే..
స్టార్ హీరోల సినిమాలు రిలీజైతే వారి ఈవెంట్లో సుమ ఉండాల్సిందే. సుమ లేని స్టార్ ఈవెంట్ కూడా జరుగుతుందా? అని అనుమానం వస్తే కూడా తప్పే లేదు. అది ఏ స్టార్ హీరోయినా పర్లేదు.. అది ఎవరి ఈవెంట్ పర్లేదు కానీ హోస్టింగ్ మాత్రం సుమ చేయాల్సిందే. మొన్నటి మొన్న సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు విడుదలైతే.. అన్నింటిని ఓ రౌండ్ వేసుకుంది.
Recommended Video


సుమకు వచ్చిన కష్టం..
తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన సుమకు వింత కష్టం వచ్చింది. సుమ వెళ్లే సరికి కిక్కిరిసినట్టు జనాలు ఉండటంతో చేసేదేమీ లేక.. కిటికీలోంచి దూకి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాపం సుమక్కకు ఎంతటి కష్టం వచ్చిందోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











