విడాకుల రూమర్స్‌పై సుమ క్లారిటీ.. అలా చేసినా ఇంకా కలిసే ఉన్నారంటూ..

టాలీవుడ్ లో యాంకరింగ్‌కి సింబల్‌గా మారిన పేరు సుమ కనకాల (Suma Kanakala). తెలుగు ప్రేక్షకులకు ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మాతృభాష మలయాళం అయినా, తెలుగును నేర్చుకుని, తన మాటల మాంత్రికతతో కోట్లాది అభిమానులను సంపాదించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా టెలివిజన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సుమ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో వేదికను కుదిపేస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవల సుమ-రాజీవ్ కనకాల (Rajeev Kanakala) మధ్య విభేదాలు, విడాకుల రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వీరిద్దరూ వేరుగా ఉంటున్నారనే వార్తలు పలు యూట్యూబ్ ఛానెల్స్‌ లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుమ ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.

సుమ కెరీర్ ఆరంభంలో టెలివిజన్ సీరియల్స్‌తో మొదలైంది. "వేయిపడగలు" సీరియల్‌తో చిన్న తెరపైకి అడుగుపెట్టిన ఆమె, ఆ తరువాత "మేఘమాల" సీరియల్‌లో నటిస్తూ ఉన్నప్పుడు నటుడు రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, చివరకు వివాహ బంధంగా మారింది. నటిగా మొదలైన సుమ కెరీర్, యాంకరింగ్ వైపు మలుపు తిరిగిన తర్వాత కొత్త దిశలో దూసుకెళ్లింది. ఆమె యాంకరింగ్ స్టైల్, స్పాంటేనియస్ టాక్ కారణంగా టెలివిజన్ రంగంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

Anchor Suma Kanakala Finally Breaks Silence on Divorce Rumours with Rajeev Kanakala

ఇటీవల సుమ-రాజీవ్ మధ్య విభేదాలు వచ్చాయని, మాట మాట పెరిగి విడాకుల దిశగా వెళ్లారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఒకప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా నిలిచిన వీరి బంధం ముగుస్తుందన్న వార్తలు అభిమానులను షాక్‌కు గురి చేశాయి. అయితే సుమ ఈ వార్తలను కొట్టిపారేస్తూ, తన భర్త రాజీవ్‌ గురించి ప్రేమగా మాట్లాడారు. తాజాగా ఆమె ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఈ అంశంపై పూర్తిగా స్పందించారు.

సుమ మాట్లాడుతూ.. "రిలేషన్షిప్ అన్నాక ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మా మ్యారేజ్‌కి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో రాజీవ్ కెరీర్, నా కెరీర్, పిల్లలు, పేరెంట్స్, అత్తమామలు ఎన్నో విషయాలు మన జీవితంలో జరిగాయి. ఒక్కో టాపిక్‌పై మనస్పర్థలు రావడం సహజం. జీవితంలో ఎప్పుడూ స్మూత్ జర్నీ ఉండదు. ఇది ఒక రోలర్ కోస్టర్ లాంటిది. అప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. కానీ, దాని అర్థం మేము విడిపోయామని కాదు" అని స్పష్టం చేశారు.

తమపై వస్తున్న రూమర్స్ గురించి సుమ ఆవేదన వ్యక్తం చేశారు. "కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మేము విడిపోయామంటూ ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేశారు. ఆ రూమర్స్‌కి చెక్ పెట్టడానికి మేమిద్దరం కలిసి వీడియోలు చేశాం. అయినా 'మీరు కలిసే ఉన్నారా?' అంటూ కామెంట్లు చేశారు. చివరికి ఆ విషయాన్ని మేము పట్టించుకోవడం మానేశాం. ఎందుకంటే ఎవరైనా ఏదో అనుకుంటారు, మనం మన జీవితం మీదే ఫోకస్ పెట్టాలి" అని చెప్పారు.

అంతేకాకుండా రాజీవ్ కనకాలతో తన బంధం గురించి సుమ ఎంతో ప్రేమగా మాట్లాడారు. "రాజీవ్ చాలా సింపుల్, సపోర్టివ్ వ్యక్తి. నేను ఎంత బిజీగా ఉన్నా, ఇంటి బాధ్యతలను చూసుకునే వ్యక్తి. నా కెరీర్‌లో ఆయన ఇచ్చిన మద్దతు నాకు బలంగా నిలిచింది. మా బంధం బలమైనది, చిన్న గొడవలు ఉండొచ్చు కానీ వాటితో ఏ సంబంధం కూడా కుదేలవదు," అని పేర్కొన్నారు. మొత్తం మీద సుమ కనకాల ఈ స్పందనతో అన్ని రూమర్స్‌కి చెక్ పెట్టారు. తాను, రాజీవ్ కనకాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తమ జీవితం ఎప్పటికీ ఒకరికి ఒకరు సపోర్ట్‌గా కొనసాగుతుందని స్పష్టంగా తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X