యాంకర్ సుమ భారీగా డిమాండ్.. ప్రమోషన్ కోసం ఎన్ని లక్షలు అంటే?
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెర స్టార్ హీరోలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో సుమ కనకాలకు టెలివిజన్ రంగంలో అంతటి క్రేజ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బుల్లితెరపై సంచలనం సృష్టించిన సుమ అదే స్థాయిలో తన రెమ్యునరేషన్ ను తీసుకుంటోంది. ముఖ్యంగా ఆమె ప్రమోషన్స్ కు తీసుకునే ఛార్జీలు షాకింగ్ గా మారాయి. తాజాగా మరో బుల్లితెర యాంకర్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
3 దశాబ్దాలుగా..
సుమ కనకాల 16 ఏళ్ల వయస్సులోనే ప్రెజెంటర్ కెరీర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియన్ టాప్ టెలివిజన్ ప్రెజెంటర్ గా, నటిగా, నిర్మాతగా సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించి అలరించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రధానంగా ETVలో స్టార్ మహిళా అనే గేమ్ షోతో పాపులర్ అయ్యింది. ఆ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దాంతో ఆమె విస్తృతంగా గుర్తింపును దక్కించుకుంది. ఈ షో ఇండియాలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రసారం అయిన టీవీ గేమ్ షోగా రికార్డు క్రియేట్ చేసింది. 12 ఏళ్లు ఈటీవీలో విజయవంతంగా కొనసాగడం విశేషం.

సుమ కుటుంబ వివరాలు..
స్టార్ యాంకర్ సుమ 1975న మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో మలయాళీ నాయర్ కుటుంబంలో పుట్టింది. ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్, పల్లస్సనా పచ్చువీట్టిల్ విమల దంపతులకు ఒక్కతే కూతురు. వారికి పెళ్లైన పదేళ్లకు సుమ కనకాల జన్మించింది. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వారు కొన్నాళ్ల పాటు సికింద్రాబాద్ లో నివసించారు. అలా తెలుగు స్టేట్ తో సుమకు బంధం పెరిగింది. లాలాగూడలోని రైల్వే డిగ్రీ కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ ను పూర్తి చేసుకుంది. 1991 నుంచి టెలివిజన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు అనేక తెలుగు మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లు, అవార్డ్ ఫంక్షనకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ లీడ్ యాంకర్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రమోషన్స్ లో జోరు..
యాంకర్ సుమ కనకాల టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ఆడియో లాంచ్ ఈవెంట్లతో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సుమ కనకాల ఆయా బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ భారీగానే కూడ బెడుతోంది. అయితే ప్రస్తుతం సుమ కనకాల ఒక్కో బ్రాండ్ ప్రమోషన్స్ కు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని, ఆమె రేంజ్ ఆ స్థాయిలో ఉంటుంది మరో టెలివిజన్ యాంకర్ చెప్పడం విశేషం. సుమకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండటంతో ఆమె పారితోషికం కూడా అధికంగానే ఉంటుందని అంటున్నారు.
సుమ కనకాల సినిమాలు..
బుల్లితెరపై యాంకర్ గా అలరించడమే కాకుండా వెండితెరపైనా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. చివరిగా హో బేబీ, జయమ్మ పంచాయతీ వంటి చిత్రాలతో అలరించింది. ఇక టెలివిజన్ పై స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ వంటి సీరియల్స్ తోనూ బుల్లి తెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం సుమా అడ్డా షోతో ప్రేక్షకులను అలరిస్తోంది.


Click it and Unblock the Notifications











