For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రముఖ షో నుంచి యాంకర్ సుమ మిస్సింగ్: తొలిసారి ఆమె లేకుండా.. అతడి ఎంట్రీతో అనుమానం

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, వాళ్లలో ఎవరూ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోలేకపోతున్నారు. దీనికి ఒకే ఒక్క కారణం.. ఆ ప్లేస్‌లో సీనియర్ యాంకర్ సుమ ఉండడమే. దాదాపు పదేళ్లుగా ఈమెనే టాప్ ప్లేస్‌లో వెలుగొందుతోంది. అంతలా అద్భుతమైన హోస్టింగ్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఏకకాలంలో ఎన్నో షోలు చేస్తూ కనిపించే సుమ.. తొలిసారి ఓ షో నుంచి తప్పుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   వాళ్లకు కూడా సాధ్యం కాని టైమింగ్

  వాళ్లకు కూడా సాధ్యం కాని టైమింగ్

  గతంతో పోలిస్తే ఇప్పుడు బుల్లితెరపై గ్లామరస్ యాంకర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. తమ అందచందాలతో ఉర్రూతలూగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ యాంకర్ సుమ తన హవాను చూపిస్తూనే ఉంది. అద్భుతమైన టైమింగ్ వల్లే ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కమెడియన్లు సైతం అందుకోలేని టైమింగ్‌తో సందడి చేస్తూ షోలలో నవ్వులు పూయిస్తుందామె.

  ఎక్కడ.. ఎందులో చూసినా సుమనే

  ఎక్కడ.. ఎందులో చూసినా సుమనే

  బుల్లితెరపై యాంకర్‌గా ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో ఏమో కానీ.. సుమ దాదాపు పదేళ్లుగా సత్తా చాటుతూనే ఉంది. ఒక్క టీవీ షోలు మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను ఆమెనే హోస్ట్ చేస్తోంది. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతోందీ టాప్ యాంకర్. తద్వారా మరింతగా ఫేమస్ అవుతూ దూసుకెళ్తోంది.

  ఇన్ని ఉండబట్టే అటు వైపు వెళ్లలేదు

  ఇన్ని ఉండబట్టే అటు వైపు వెళ్లలేదు

  యాంకర్ సుమకు యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్, డైలాగ్ డెలివరీ ఇలా పలు అంశాల్లో బాగా పట్టున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత టాలెంట్, ఫేమ్ ఉన్నా ఆమె మాత్రం సినిమాల్లో నటించడం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ... ఇప్పుడు మాత్రం ఆ వైపు తిరిగి చూడడం లేదు. అయితే, ఆ మధ్య ‘విన్నర్' మూవీ కోసం ఓ పాటను పాడిందామె.

   ఎన్నో షోలు.. అయినా తగ్గడం లేదు

  ఎన్నో షోలు.. అయినా తగ్గడం లేదు

  ప్రస్తుతం యాంకర్ సుమ కనకాల ఏక కాలంలో ఎన్నో షోలను హోస్ట్ చేస్తోంది. ‘క్యాష్', ‘స్టార్ట్ మ్యూజిక్' సహా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తోంది. తద్వారా పలు ఛానెళ్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు జీ తెలుగు ఛానెల్‌లో ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే స్పెషల్ షోను కూడా నడిపిస్తోంది. ఈ ప్రోగ్రాంకు సుమతో పాటు రవి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.

  రవితో కలిసి సెలెబ్రిటీలతో రచ్చ రచ్చ

  జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' కార్యక్రమంలో సెలెబ్రిటీలు గెస్టులుగా వస్తుంటారు. ప్రతి వారం ఏదో ఒక సినిమాకు సంబంధించిన వాళ్లో.. ఓ షోలో చేసే వాళ్లోనో తీసుకొచ్చి వాళ్లతో సవాళ్లు చేయిస్తుంటారు. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ షోలో యాంకర్ సుమ.. రవి చేసే సందడి వల్ల టెన్షన్ కనిపించదు. అదే సమయంలో వీళ్లద్దరూ కామెడీతో నవ్విస్తుంటారు.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  అతడి ఎంట్రీతో మరింత అనుమానం

  అతడి ఎంట్రీతో మరింత అనుమానం

  ఇక, ఇదే ఎపిసోడ్‌కు ప్రముఖ కమెడియన్ సద్దాం హుస్సేన్ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే తనదైన శైలి కామెడీతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఆచార్యలో చిరంజీవి గెటప్, అఖండలో చిరంజీవి గెటప్‌లు కూడా వేసి సందడి చేశాడు. సద్దాం హుస్సేన్ రాకతో సుమ మళ్లీ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆమె ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

  English summary
  Suma Kanakala and Anchor Ravi Now Doing Big Celebrity Challenge Show. In Latest Promo Suma Was Missing And Comedian Saddam Hosting The Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X