Suma Kanakala : పంజాబీ డ్రెస్‌లో స్టార్ యాంకర్ హోయలు.. 50కి దగ్గరైనా తగ్గడం లేదుగా!

తెలుగు బుల్లితెరపై దాదాపు పాతికేళ్లుగా స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు కేరళ కుట్టి సుమ కనకాల . ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు, వెళ్లారు కానీ సుమ మాత్రం నేటికీ తన హవా చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా యాంకరింగ్‌లో అడుగుపెట్టాలని భావించే వారికి సుమ కెరీర్ ఓ డిక్షనరీ లాంటిది. ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఎలాంటి పంచ్‌లు విసరాలి? డల్‌గా ఉన్న వాతావరణాన్ని ఎలా ఆహ్లాదంగా మార్చాలో సుమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.

తెలుగమ్మాయి కాకపోయినా తెలుగువారి కంటే అద్భుతంగా తెలుగును మాట్లాడుతూ భాషాభిమానుల మన్ననలు పొందుతున్నారు సుమ కనకాల. ఆమెతో పాటు కెరీర్ ప్రారంభించిన వాళ్లు ఇప్పటికే ఫేడ్ ఔట్ అయిపోగా సుమ మాత్రం ఇంకా ఊపిరి సలపనంత బిజీగా ఉంటున్నారు. అది కూడా నెంబర్‌వన్‌గా. కొత్తగా ఎంతమంది అందగత్తెలు యాంకరింగ్‌లోకి వచ్చినా సుమను మాత్రం టచ్ చేయడం కష్టం అనేంతగా ఆమె తన ముద్ర వేశారు.

Anchor Suma Kanakala photoshoot with punjabi dress her photos goes viral

1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. ఆమె పూర్తి పేరు పల్లాస్సన పాచువెట్టిల్ సుమ. తల్లిదండ్రులు ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్, పల్లాస్సన పాచువెట్టిల్ విమల. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో స్థిరపడింది. స్థానిక సెయింట్ ఆన్స్ హైస్కూల్‌, రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు సుమ. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉన్న ఆమె స్టేజ్‌‌పై పలు ప్రదర్శనలు ఇచ్చారు.

చదువు తర్వాత 16 ఏళ్ల వయసులోనే వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చి ముక్కున వేలేసుకునేలా చేశారు. తొలుత కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. ఆ తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ తదితర సినిమాల్లో నటించారు. పవిత్ర ప్రేమలో మూవీలో ఏకంగా నటసింహం నందమూరి బాలకృష్ణ చెల్లెలిగా కనిపించారు . అయితే తక్కువ సమయంలో తనకు సినిమాలు సెట్ కావని అర్ధం చేసుకున్న సుమ.. చావో రేవో బుల్లితెరపైనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

నాటి నుంచి తెలుగుబుల్లితెరపై షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలను చేస్తూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ.. తన ఈవెంట్లు, షోలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య ఇటీవల 30 లక్షలకు ( 3 మిలియన్ల మంది)కి చేరుకుంది. తాజాగా పంజాబీ డ్రెస్‌లో సుమ హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: suma kanakala movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X