Suma Kanakala : దారుణ పరిస్ధితుల్లో యాంకర్ సుమ .. ఇవన్నీ దాని లక్షణాలేనా , వీడియోతో వెలుగులోకి
తెలుగు నాట స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు సుమ కనకాల. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగువారి కంటే అద్భుతంగా తెలుగును మాట్లాడుతూ దూసుకెళ్తున్నారు . ఆవిడతో పాటు కెరీర్ ప్రారంభించిన వాళ్లు ఇప్పటికే ఫేడ్ ఔట్ అయిపోగా సుమ మాత్రం ఇంకా నెంబర్‌వన్‌గానే ఉన్నారు. కొత్తగా ఎంతమంది యాంకరింగ్‌లోకి వచ్చినా సుమకి పోటీ ఇచ్చేవాళ్లు మాత్రం లేరు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే :
1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. ఆమె పూర్తి పేరు పల్లాస్సన పాచువెట్టిల్ సుమ. తల్లిదండ్రులు ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్, పల్లాస్సన పాచువెట్టిల్ విమల. తండ్రి ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్ మెట్టుగూడలో స్థిరపడింది. స్థానిక సెయింట్ ఆన్స్ హైస్కూల్, రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు సుమ. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చారు.

చదువు పూర్తయిన తర్వాత అప్పట్లో ఆడియో లాంచ్ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు సుమ. 16 ఏళ్ల వయసులోనే వ్యాఖ్యాతగా అలరించారు. ఈ క్రమంలో 1995లో శాటిలైట్ ఛానెల్స్ హవా భారతదేశంలో మొదలవుతున్న దశలో పలు సీరియల్స్‌లో నటించారు. స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ వీటిలో కొన్ని. అలా కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో నటించారు. పవిత్ర ప్రేమలో నందమూరి బాలకృష్ణ చెల్లెలిగా అలరించారు సుమ. అయితే తనకు సినిమాలు సెట్ కావని గ్రహించిన ఆమె బుల్లితెరపై ఫోకస్ పెట్టారు.
నాటి నుంచి బుల్లితెరపై షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలను చేస్తూ నెంబర్ వన్ అనిపించుకున్నారు. జీటీవీ, ఈటీవీ, మాటీవీ, జెమినీ టీవీలలో సుమ యాంకరింగ్ చేసిన ఎన్నో కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళ ఏకంగా వేలాది ఎపిసోడ్‌లు రన్ అయ్యింది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సుమ అనర్గళంగా మాట్లాడతారు. సినిమాలను దాదాపు వదిలేసిన తర్వాత చాలా ఏళ్లకు సుమ లీడ్ రోల్‌లో నటించిన జయమ్మ పంచాయతీ 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుమ.. తన ఈవెంట్లు, షోలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. ఈ వయసులోనూ ట్రెండీ వేర్‌లో ఫోటో షూట్‌లు నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటారు సుమ. తాజాగా ఆమె ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఓ కప్ బోర్డ్‌ను ఓపెన్ చేసిన సుమ.. అసలు నేనేందుకు ఓపెన్ చేశాననని ఆలోచిస్తుంది. ఆ వెంటనే మొబైల్‌లో ఎవరికో ఫోన్ చేసి విషయం గుర్తురాక మళ్లీ చేస్తానని చెబుతుంది. మిమ్మల్ని ఎవరు పిలిచారని ఓ కుర్రాడిని అడగ్గా..నేనే మిమ్మల్ని పిలిచానని అతను బదులిస్తాడు. ఈ మతిమరుపుతో అందరూ ఇబ్బంది పడుతున్నారని సుమ చెబుతూ వీడియోను ముగిస్తుంది. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











