హోటల్‌ బిల్ 25 లక్షల రూపాయలు... షాక్‌లో యాంకర్ సుమ.. ఇంత దారుణమా అంటూ

సుమ కనకాల.. ఈ పేరు గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు వారికంటే తెలుగుని బాగా మాట్లాడుతుంది. మాట్లాడుతుంది అనడం కంటే ఆటాడుకుంటుంది అనడం కరెక్ట్ ఏమో. పంచ్‌లు, ప్రాసలు విసురుతూ గడగడ మాట్లాడుతూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ దాదాపు 25 ఏళ్లుగా తెలుగు బుల్లితెరను క్వీన్‌గా ఏలుతోంది. వెండితెర, బుల్లితెర, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లు ఇలా ఎక్కడ చూసినా సుమయే కనిపిస్తుంది.

ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోటోలు, వీడియోలు, రీల్స్, మీమ్స్ ఇలా ఎక్కడో ఒక చోట సుమను చూడాల్సిందే. అలా తెలుగువారికి జీవితంలో ఒక భాగమైపోయారు సుమ కనకాల. ఎంతోమంది యాంకర్లు వచ్చారు.. వెళ్లారు కానీ సుమ మాత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. ఎప్పుడు? ఎక్కడ? ఎలా మాట్లాడాలి? ఎలాంటి పంచ్‌లు వేయాలి? ఎలా నవ్వించాలి అన్నది సుమకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. నవ్వుతూ నవ్విస్తూ తాను ఉన్నచోటిని ఆహ్లాదకరంగా మార్చేస్తారు సుమ.

Anchor Suma Kanakala Shocked to seen Hotel bill during Vietnam tour

1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు సుమ. ఆమె పూర్తి పేరు పల్లాస్సన పాచువెట్టిల్ సుమ. తల్లిదండ్రులు ప్రణవి నారాయణన్ కుట్టి నాయర్, పల్లాస్సన పాచువెట్టిల్ విమల. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో స్థిరపడింది. ఆమె విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న సుమ.. చిన్న వయసులోనే పలు ప్రదర్శనలు ఇచ్చారు. యాంకరింగ్ కంటే ముందే ఆమెకు సినిమాలలో అవకాశాలు క్యూకట్టాయి. కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. ఆ తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రావోయి చందమామ తదితర సినిమాల్లో నటించారు.

ఈ దశలో తెలుగునాట కేబుల్ టీవీ ప్రసారాలు ఊపందుకోవడంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టారు సుమ. దూరదర్శన్ నుంచి మొదలుపెట్టి నేటి ఓటీటీ యుగం వరకు అన్ని దశల్లోనూ స్టార్ అనిపించుకుని ఏలుతున్నారు. అప్పుడప్పుడు సినిమాలలో గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సీనియర్ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తీక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు శ్రమిస్తున్నారు సుమ.

క్షణం తీరిక లేని జీవితంలోనూ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. కుటుంబానికి, స్నేహితులకు సమయం కేటాయిస్తున్నారు సుమ. వీలు కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్‌తో గడుపుతూ ఉంటారు. తాజాగా కొద్దిరోజుల క్రితం తన స్నేహితులతో కలిసి వియత్నాం ట్రిప్ వేశారు సుమ కనకాల. అక్కడి రోడ్లపై తిరుగుతూ, షాపింగ్ చేస్తూ, స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ హోటల్‌కి వెళ్లిన సుమ అండ్ బ్యాచ్.. అక్కడ డిఫరెంట్ ఫుడ్ చూసి షాకయ్యారు. ఎగిరేవి, ఈదేవీ, పాకేవీ అన్ని చూసి అవాక్కయ్యారు. డిఫరెంట్ కంట్రీకి వచ్చాము కాబట్టి.. డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనే ఆశతో వియత్నాం భాషలో నోరు తిరగని ఫుడ్‌ని ఆర్డర్ చేశారు సుమ. ఫుడ్ వచ్చాక సుమతో పాటు ఆమె ఫ్రెండ్స్ అంతా టేస్ట్‌కి ఫిదా అయ్యారు.

వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు.. వెయిటర్ తీసుకొచ్చిన బిల్లు చూసి సుమ కనకాల అండ్ బ్యాచ్ షాకైంది. ఆ బిల్లు విలువ అక్షరాల 25 లక్షల 27 వేల 200 రూపాయలు కావడమే దీనికి కారణం. రెండు చేపలు, రెండు రొయ్యలకు అంతా బిల్లా అని వారంతా ఖంగుతున్నారు. అందరి కంటే ఆ బిల్లును చూడగానే సుమకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మన ఒక రూపాయి = 296 వియత్నాం డాలర్. దానిని బట్టి మన కరెన్సీలో అయిన బిల్లు 8300 రూపాయలు.. దీనిని అక్కడి కరెన్సీలోకి మారిస్తే అయిన బిల్లు 25.27 లక్షల రూపాయలు అని సుమ కనకాల వివరించారు. చివరిలో వెయిటర్‌కి టిప్పు కూడా ఇచ్చి అతనికి థ్యాంక్స్ చెప్పారు సుమ అండ్ బ్యాచ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సుమ పంచ్‌లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

More from Filmibeat

Read more about: suma kanakala rajeev kanakala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X