బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. ఫేవరిజంపై సుమ కామెంట్లు.. ఎవరికి ఇచ్చుకోవాలో వాళ్లకే ఇచ్చుకుంటున్నారుగా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఈరోజుటి ముగుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 15 వారాల పాటు బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తూ... ఉర్రూతలూగించిన ఈషో విన్నర్, రన్నరప్ లు ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇప్పటికే అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, శివాజిలు ఎలిమినేట్ అయ్యారని.. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ గా నిలవబోతున్నట్లు సమాచారం.

అయితే రైతుబిడ్డ విన్నర్ గా నిలుస్తాడని, శివాజి రన్నరప్ గా అవుతాడని అంతా అనుకున్నారు. కానీ లెక్కలు అన్నీ తారు మారు అయ్యాయి. దీంతో అందరూ బిగ్ బాస్ ఫేవరిజం చూపించారని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని సుమ కూడా బిగ్ బాస్ ఫినాలే స్టేజీపైనే చెప్పేసింది. అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Anchor Suma Kanakala Shocking Comments on Nagarjuna About Favourism in Bigg Boss Telugu 7

బిగ్ బాస్ షో మొదటి వారంలో ఇంట్లో అడుగు పెట్టిన వాళ్లలో సీరియల్ బ్యాచ్ వాళ్లంతా ఓ గ్రూపుగా మారి గేమ్ ఆడారు. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ లు కలిసే గేమ్స్ ఆడారు. కావాలని ప్లాన్ చేసుకుని ఎలిమినేషన్ కోసం నామినేషన్లు కూడా చేసేశారు. ఇలా జనాలకు చాలా సార్లే దొరికినా... ముఖ్యంగా శోభాశెట్టి ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిందని అంతా చెప్పారు. కానీ ఆమె మాత్రం 14వ వారంలో ఎలిమినేట్ అయింది. ఆమెను ఇక్కడి వరకు తీసుకురావడానికి బిగ్ బాస్ ఎంతగానో ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

గతంలో శోభాశెట్టి ఓ వారం ఎలిమినేట్ కావాల్సి ఉండగా... ముఖ్యంగా ఓటింగ్ లిస్టులో ఆమెనే లీస్ట్ లో ఉండగా ముద్దుబిడ్డ కోసం బిగ్ బాస్ ఎలిమినేషన్ నే ఎత్తేశాడు. ఉల్టాపుల్టా కాన్సెప్ట్ పేరు చెబుతూ తమకు నచ్చిన వాళ్లను ఇంట్లో ఉంచుకుంటూ వచ్చారు. దీనిపై చాలా కాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, అంబటి అర్జున్ లను టాప్ 5లోకి తీసుకు వచ్చేందుకు చాలనే ప్రయత్నాలు చేశారని అందరికీ తెలిసిందో. షోను రోజూ ఫాలే అయ్యే వారికి ఆ విషంయ సులువుగా అర్థం అయిపోతుంది.

అయితే తాజాగా విడుదల అయిన బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ప్రోమో చూస్తుంటే ఈ విషయం మరింత క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ముఖ్యంగా యాంకర్ సుమ ఈరోజు బిగ్ బాస్ ఫినాలే స్టేజీపైకి వచ్చారు. కొడుకు రోహాన్ కనకాల బబుల్ గమ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె స్టేజీపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ తో పాటు కొడుకును వెంట పెట్టుకని వచ్చింది సుమ. ఈక్రమంలోనే నాగార్జున హేయ్ బిగ్ బాస్ షోకు నువ్వు వచ్చావా అనగా.... మీ యాంకరింగ్ చూద్దామని వచ్చానని సుమ అంటుంది. దానికి నువ్వు చేయాల్సిని పని నేను చేస్తున్నానని చూస్తున్నావా అంటూ అన్నాడు నాగ్.

ఈక్రమంలోనే యాంకర్ సుమ.. మీలాగా నేను చేయలేను, మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వాడ్ అంటూ తెలిపింది. కానీ ఆ తర్వాత మాత్రం ఎవరికి ఇచ్చుకోవాలో, వారికే ఇచ్చేసుకుంటున్నారని అంది. ప్రస్తుతం సుమ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె కావాలనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఫేవరిజం గురించి మాట్లాడిందని అంటున్నారు. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్ప సుమ ఎందుకు, ఏం ఉద్దేశించి అలా అందో తెలియదు. మరికొద్ది గంటల్లో టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ చూసి ఆమె ఎందుకలా అందో తెలుసుకోండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X