Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
మూగ జీవిపై యాంకర్ సుమ తల్లి ప్రేమ.. మొదటిసారి అలా ఎమోషనల్
యాంకర్ సుమ ఎలాంటి షో చేసినా కూడా టీవీ ప్రపంచంలో వైరల్ అవ్వాల్సిందే. కంటెంట్ కు తగ్గట్లుగా షో నడిపించే అతి తక్కువ మంది యాంకర్స్ లలో సుమ ఒకరు. ఆమె టాలెంట్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఇక సుమ సోషల్ మీడియాలో కూడా తన స్థాయిని మరింత పెంచుకుంటోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్యాన్సర్ బారిన పడ్డ తల్లి కోసం.. పీపీఈ కిట్లో రాఖీ సావంత్ సేవలు.. కంటతడి పెట్టించేంతగా
సహా నటిగా కూడా
సుమ యాంకర్ అవ్వడానికి ముందుగా ఒక టీవి నటిగా మంచి క్రేజ్ అందుకుంది. దూరదర్శన్ కాలంలోనే సిరియల్స్ ద్వారా తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యారు. ఇక మెల్లగా హీరోయిన్ గా కూడా ఒక సినిమా ట్రై చేశారు. సహా నటిగా కూడా పలు మంచి పాత్రలతో మెప్పించింది. వర్షం లాంటి సినిమాల్లో హీరో సోదరి వంటి పాత్రలు కూడా చేసింది.
ఆమె టచ్ చేయని ఈవెంట్స్ లేవు.
సుమ ఒక మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గౌరవ సన్మానాల సభల నుంచి మొదలుకొని సినిమా వేడుకల వరకు ఆమె టచ్ చేయని ఈవెంట్స్ లేవు. టీవీ రంగంలోనే రాజీవ్ కనకాలకు స్నేహితురాలిగా దగ్గరైన ఆమె అనంతరం ప్రేమ నుంచి పెళ్లి బంధం వరకు వెళ్లారు.
సుమ ఉంటే చాలు..
గత 15 ఏళ్లుగా యాంకర్ గా తిరుగులేని విధంగా కొనసాగుతున్న సుమను మిగతా వారి నుంచి పెద్దగా పోటీ అయితే రాలేదు. పెద్ద హీరోల సినిమాలు ఉంటే యాంకర్ గా సుమ ఉండాల్సిందే. సుమ ఉంటే ఈవెంట్స్ చాలా హ్యాపీగా సరదాగా కొనసాగుతాయని ఇండస్ట్రీలో చాలా మంది నమ్మకం.
సుమ స్పెషల్ వీడియో
ఇక అప్పుడప్పుడు సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆమె సోషల్ మీడియాలో కూడా అమితంగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఇటీవల పోస్ట్ చేసిన ఒక వీడియో కూడా నెటిజన్లను టచ్ చేసింది. ఒక ఆవు లేగ దూడను సుమ ప్రేమగా రాముడు అంటూ పిలుస్తున్న తీరు ఎంతో క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
లెక్కలేనంత సంతోషంగా
ఇక సుమ కూడా ఆ వీడియో ఎన్ని సార్లు చూసినా కూడా లెక్కలేనంత సంతోషంగా ఉంటుందని కామెంట్ చేయడంతో ఆమె చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. సుమ పిలవడంతో ఆ దూడ కూడా ఎగిరి గంతేస్తూ తన సంతోషాన్ని చూపించుకుంది. దీంతో వీడియో చూసిన నెటిజన్లు కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.