twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేకప్ మెన్‌ల వివరాలు.. తానే సీనియర్ అంటోన్న సుమ!!

    |

    యాంకర్ సుమ బుల్లితెరపై ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆమె వేసే కామెడీ, సెటైర్లు, పంచ్‌లు అందరికీ తెలిసిందే. తన టెక్నీషియన్స్‌తో, మేకప్‌మెన్స్‌తోనూ అంతే సరదాగా ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల సుమ తన ఇంట్లో కూడా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిపోయింది. ఇంట్లోనూ అంతే జాలీగా హ్యాపీగా ఉంటూ సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇంట్లో వంటలు చేస్తూ, డ్యాన్సులు చేస్తూ సరదా సరదాగా గడిపి వేసింది.

    తాజాగా తన మేకప్ మ్యాన్స్ గురించి చెబుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అందులో ఉన్న ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. వాళ్ల సీనియార్టిపై కామెంట్స్ చేసింది. ఇక అందరి వివరాలు నెటిజన్లకు చెప్పిన తరువాత తానే అందరి కంటే ఎక్కువ సీనియర్ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియోకు సంబంధించిన వివరాలను సుమ చెప్పగా ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.

    Anchor Suma Makeup Men Details

    మినీ ఇంటర్వ్యూ అంటూ సుమ తన మేకప్ మేన్‌ల గురించి చెప్పింది. రమేష్ అంటూ ఓ వ్యక్తిని పిలవడంతో అతను.. మాస్క్ తీసేశాడు. దీంతో సుమ ఒక్కసారిగా ఫైర్ అయింది. మాస్క్ పెట్టుకో అంటూ హెచ్చరించింది. ఇక అతను 20 ఏళ్లు అని చెప్పాడు. మొన్నే అతని 50వ బర్త్ డే అయిందని తెలిపింది. మరో వ్యక్తిని అడగా 21 ఏళ్లు అని తెలిపాడు. ఇక హరి అంటూ అతను ఈ ప్రొఫెషన్‌లో ఇప్పుడే పుట్టాడు.. పరిమళించిన పువ్వు అని తెలిపింది. అయితే అతను డ్రైవింగ్‌లో 16 ఏళ్ల అనుభం.. 13 ఏళ్లు మీ దగ్గర అని బదులిచ్చాడు. ఇక గీత అనే మహిళకు పదిహేనేళ్ల అనుభం ఉందని తెలిపింది. అందరి కంటే ఎక్కువగా తనకే ముప్పై యేళ్ల అనుభవం ఉందని పేర్కొంది.

    English summary
    Anchor Suma Makeup Men Details, Very very committed hardworkers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X