Don't Miss!
- News సీఎం జగన్‌పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మేకప్ మెన్ల వివరాలు.. తానే సీనియర్ అంటోన్న సుమ!!
యాంకర్ సుమ బుల్లితెరపై ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఆమె వేసే కామెడీ, సెటైర్లు, పంచ్‌లు అందరికీ తెలిసిందే. తన టెక్నీషియన్స్‌తో, మేకప్మెన్స్తోనూ అంతే సరదాగా ఉంటుంది. ఈ లాక్డౌన్ వల్ల సుమ తన ఇంట్లో కూడా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిపోయింది. ఇంట్లోనూ అంతే జాలీగా హ్యాపీగా ఉంటూ సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇంట్లో వంటలు చేస్తూ, డ్యాన్సులు చేస్తూ సరదా సరదాగా గడిపి వేసింది.
తాజాగా తన మేకప్ మ్యాన్స్ గురించి చెబుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అందులో ఉన్న ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. వాళ్ల సీనియార్టిపై కామెంట్స్ చేసింది. ఇక అందరి వివరాలు నెటిజన్లకు చెప్పిన తరువాత తానే అందరి కంటే ఎక్కువ సీనియర్ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియోకు సంబంధించిన వివరాలను సుమ చెప్పగా ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.
మినీ ఇంటర్వ్యూ అంటూ సుమ తన మేకప్ మేన్ల గురించి చెప్పింది. రమేష్ అంటూ ఓ వ్యక్తిని పిలవడంతో అతను.. మాస్క్ తీసేశాడు. దీంతో సుమ ఒక్కసారిగా ఫైర్ అయింది. మాస్క్ పెట్టుకో అంటూ హెచ్చరించింది. ఇక అతను 20 ఏళ్లు అని చెప్పాడు. మొన్నే అతని 50వ బర్త్ డే అయిందని తెలిపింది. మరో వ్యక్తిని అడగా 21 ఏళ్లు అని తెలిపాడు. ఇక హరి అంటూ అతను ఈ ప్రొఫెషన్లో ఇప్పుడే పుట్టాడు.. పరిమళించిన పువ్వు అని తెలిపింది. అయితే అతను డ్రైవింగ్‌లో 16 ఏళ్ల అనుభం.. 13 ఏళ్లు మీ దగ్గర అని బదులిచ్చాడు. ఇక గీత అనే మహిళకు పదిహేనేళ్ల అనుభం ఉందని తెలిపింది. అందరి కంటే ఎక్కువగా తనకే ముప్పై యేళ్ల అనుభవం ఉందని పేర్కొంది.
View this post on InstagramVery very committed hardworkers. @ramesh_bridal_makeovers @makeupby_sathya
A post shared by Suma P (@kanakalasuma) on