అలాంటి వాటికి యాడ్.. ఇలా కూడా వాడేస్తున్నారా?.. సుమ ప్లాన్ అదిరింది

బుల్లితెర మహారాణి సుమ యాంకరింగ్ సామ్రాజాన్యి ఏకఛత్రాదిపత్యం కొనసాగిస్తోంది. బుల్లితెరపై సుమ కనబడని చానెల్ ఉండదు. కనబడని ప్రోగ్రాం ఉండదు. ఇక సినిమా వేడుకలైతే సుమ లేనిదే జరగవు. ఎంత పెద్ద స్టార్ వేడుకలైనా సరే సుమ మాటలు వినబడాల్సిందే. పంచ్‌ల వర్షం కురవాల్సిందే. ఇలా నాలుగు చేతులా సంపాదించే సుమ.. ప్రకటనల్లోనూ ఫేమస్. బుల్లితెరపై కొన్ని ఉత్పత్తుల ప్రకటనల్లో సుమ మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఉత్పత్తిని ప్రమోట్ చేసే బాధ్యతను తన భుజాన వేసుకుంది.

 ఫుల్ బిజీగా..

ఫుల్ బిజీగా..

యాంకర్‌గా సుమ ఎంత బీజీనో అందరికీ తెలిసిందే. వారంలో ఏడు రోజులు ఏదో ఒక షూటింగ్, ఏదో ఒక పనితో బిజీగా ఉంటుంది. ఇప్పుడు లాక్ డౌన్ కావడం, సినిమా ఫంక్షన్లు లేకపోవడంతో కాసింత విశ్రాంతి దొరికినట్టుంది. అయితే ఈ లాక్ డౌన్‌లోనూ సుమ తనదైన శైలిలో అందర్నీ ఎంటర్టైన్ చేసింది.

లాక్ డౌన్‌లో హల్చల్..

లాక్ డౌన్‌లో హల్చల్..

లాక్ డౌన్ కాలంలో సుమ.. సోషల్ మీడియాలో మాములుగా రచ్చ చేయలేదు. వంటింటి ఘుమఘుమలు అందరికీ రుచిచూపించింది. ఫాంహౌస్‌లో చిన్న పిల్లలా ఆడుకుంటూ గెంతులు వేసింది. ఇక తన కుక్క పిల్ల ముందు స్టెప్పులు వేసి దానికి చుక్కలు చూపించింది. ఇలా తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటూ తెగ సందడి చేసింది.

మొదలెట్టిన షూటింగ్స్..

మొదలెట్టిన షూటింగ్స్..

కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ.. షూటింగ్‌లు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే సుమ మళ్లీ స్టార్ మహిళ ప్రోగ్రాంను తెరపైకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక సుమ ఇంట్లో నుంచే షూటింగ్ చేసినట్టు కనిపిస్తోంది.

ఇంట్లోనే షూట్..

ఇంట్లోనే షూట్..

సుమ ఇంట్లోనే ఉంటూ తాజాగా ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి సమయాన్ని కూడా సుమ చక్కగా వాడుకున్నట్టు తెలుస్తోంది. బయటకు వెళ్లి షూటింగ్ చేసి లేనిపోని రోగాన్ని తెచ్చుకునే ఇంట్లోనూ ఉంటూ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది.

Recommended Video

Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
 అగర్ బత్తికి యాడ్...

అగర్ బత్తికి యాడ్...

సుమ తాజాగా మంగళ్ దీప్ అగర్ బత్తికి సంబంధించిన ప్రకటనలో పాల్గొంది. దీనికి సంబంధించి సుమ ఇంట్లోనే యాడ్ షూట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు యాడ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఇంట్లో వాళ్లు ప్రశాంతంగా ఉండటానికి, నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ నింపడానికి మంగళ్ దీప్ అగర్ బత్తి తోడ్పుతుంది. ఇలాంటి సాంబ్రాణి వల్ల మీకు ఎలాంటి ఫీలింగ్స్, అనుభవాలు కలిగాయో కామెంట్స్ రూపంలో తెలపండి. ఇళ్లు శుద్దం మనసు శుద్దం.. మంగళ్ దీప్‌తో పూజ' అంటూ పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X