Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
యాంకర్ ప్రదీప్, సుమ షోకు 60 కోట్ల నష్టం.. వల్గారిటీ వలన తీవ్ర విమర్శలు!
Recommended Video
యాంకర్ గా సుమ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకమా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్లుగా యాంకరింగ్ లో సుమ కొనసాగుతున్నా ఎలాంటి వివాదాలు సుమ దరి చేరలేదు. ఇక ప్రదీప్ కూడా ప్రతిభ ఉన్న యాంకరే. కానీ ప్రదీప్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా వీరిద్దరూ కలసి ఓ ఛానల్ లో పెళ్లి చూపులు అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ ప్రచార కార్యక్రమాలతో ఈ షోని ప్రారంభించారు. కానీ ఈ షో వలన సుమ, ప్రదీప్ తో పాటు నిర్వాహకులు కూడా విమర్శల పాలవుతున్నారు.
అలా భావించి చిక్కుల్లో
సుమ, ప్రదీప్ యాంకరింగ్ అంటే చెవి కోసుకుని బుల్లితెర అభిమానులు ఉన్నారు. సందర్భానుసారంగా జోకులు వేస్తూ షోని సరదాగా నడిపించడం వీరి ప్రత్యేకత. వీరిద్దరికి ఉన్న క్రేజ్ తో సులువుగా పెళ్లి చూపులు షోకు టిఆర్పి రేటింగ్స్ రాబట్టవచ్చని నిర్వాహకులు భావించారు. కానీ ఈ షోకు ఏమాత్రం ఆదరణలభించకపోగా విమర్శలపాలవుతోంది.
వల్గారిటీ వలన
ఈ షోలో పాల్గొంటున్న అమ్మాయిలలో వల్గారిటీ ఎక్కువవుతోందనే విమర్శలు వినిపిస్తన్నాయి. దీనితో చాలా మంది ఈ షోపై ఆసక్తి చూపడం లేదు. మరికొందరు మాత్రం అసలు ఈ షోనే ఆపేయండి అంటూ నిర్వాహకులకు సందేశాలు పంపుతున్నారట. దీనితో షో సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.
60 కోట్ల నష్టం
పెళ్లి చూపులు షో ఆదిలోనే విఫలం కావడంతో యాజమాన్యానికి 60 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీనితో ఇకపై ఖర్చు పెట్టలేక నవంబర్ 9తో షోని ముగించనున్నట్లు తెలుస్తోంది.
అనసూయ వచ్చినా కూడా
షాపై ఆసక్తి పెంచడానికి మధ్యలో అనసూయ వంటి క్రేజీ సెలెబ్రిటీలని గెస్ట్ లుగా కూడా తీసుకుని వచ్చారు. అయినా కూడా ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఇప్పటికే షోలో పాల్గొనే అమ్మాయిలందరినీ పంపించేశారట. షో ముగిసేవరకు బయట కనిపించకూడదని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.