కాలకేయకు భార్య ఉంటే అది రోహిణే .. బిగ్‌బాస్ ఫేమ్ సెలబ్రిటీపై సెటైర్లు.. ఆటాడుకొన్న యాంకర్ సుమ

లాక్‌డౌన్, కర్యూల కారణంగా షూటింగులు ఆగిపోవడం, సినిమా థియేటర్లు మూతపడటంతో బుల్లితెర వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సుమ హోస్ట్‌‌గా కొనసాగుతున్న స్టార్ట్ మ్యూజిక్ షో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతున్నది. తాజాగా ఈ ఎపిసోడ్‌లో సుమ ఇతర కంటెస్టెంట్ల హంగామా ఓ రేంజ్‌లో ఆకట్టుకొన్నది. ఈ ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే...

బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి

బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి

స్టార్ట్ మ్యూజిక్ టెలివిజన్ షోలో తాజా ఎపిసోడ్‌లో రాజా రవీంద్ర, బిగ్ బాస్ ఫేమ్ రోహిణి, యాక్టర్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెలబ్రిటీలను రూలర్స్, వారియర్స్ టీమ్‌లుగా విడగొట్టారు. రూలర్స్ టీమ్‌కు రాజా రవీంద్ర, వారియర్స్ టీమ్‌కు శివారెడ్డి కెప్టెన్స్‌గా వ్యవహరించారు. ఇక మ్యూజిక్ ప్రధానంగా సాగే ఈ షోలో వారు మరింత సందడి చేశారు.

సుమతో పోటాపోటీగా రోహిణి

సుమతో పోటాపోటీగా రోహిణి

సాధారణంగా హోస్ట్ సుమ హంగామా ఓ రేంజ్‌లో ఉంటుందనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె జోష్‌కు బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి జత కలిసింది. స్టేజ్ మీద పదునైన మాటలు, సెటైర్లతో హల్‌చల్ చేసింది. స్టేజ్ మీద సుమకు ధీటుగా రోహిణి సందడి చేస్తూ అందర్నీ ఆటపట్టించే ప్రయత్నం చేసింది.

శివారెడ్డి టీమ్‌పై సెటైర్లు

శివారెడ్డి టీమ్‌పై సెటైర్లు

అయితే రోహిణిపై సుమ సెటైర్లు భారీగా సాగాయి. రోహిణి చేసే అల్లరిని అడ్డుకోవడానికి సుమ రకరకాలుగా ప్రయత్నించింది. రోహిణి ఓ దశలో రెచ్చిపోయి శివారెడ్డి టీమ్‌పై కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో శివారెడ్డి టీమ్ సపోర్ట్ చేస్తానని సుమ చెప్పడం ప్రోమోలో కనిపించింది. ఇలా ఆద్యంతం సెటైర్లు, ఫన్నీ కామెంట్లతో ఈ ఎపిసోడ్ సాగినట్టు స్పష్టమైంది.

కాలకేయ భాషతో హాస్యం

కాలకేయ భాషతో హాస్యం

స్టార్ట్ మ్యూజిక్ షో పీక్స్‌లో సాగుతుండగా.. రోహిణి కాలకేయ భాషను మాట్లాడుతూ హాస్యాన్ని పంచింది. బాహుబలి చిత్రంలో కాలకేయ మాట్లాడే భాషను అనుకరిస్తూ తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దాంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. అంతలోనే శివారెడ్డి టీమ్‌లో ఉన్న సెలబ్రిటీ స్పందిస్తూ.. బాహుబలిలో కాలకేయ భార్యను చూపించలేదు. ఒకవేళ చూపిస్తే రోహిణి మాదిరిగానే ఉంటుంది అని కామెంట్ చేసింది.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
యాంకర్ సుమ హోస్టింగ్‌తో

యాంకర్ సుమ హోస్టింగ్‌తో

స్టార్ట్ మ్యూజిక్ షో ప్రతీ వారం తన రేటింగ్‌ను మెరుగు పరుచుకొనే ప్రయత్నం చేస్తున్నది. సుమ విభిన్నమైన శైలితో ప్రతీ ఎపిసోడ్‌‌ను రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ షో ప్రతీ ఆదివారం స్టార్ మా ఛానెల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతుంది. ఇక షో ఎపిసోడ్స్ డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X