Women's Day : యాంకర్ సుమ షాకింగ్ వీడియో.. తన తల్లి గురించి ఇలా!
స్టార్ యాంకర్ సుమ కనకాల దక్షిణాదిన ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో తెలిసిందే. సౌత్ లో ఎలాంటి బిగ్ ఈవెంట్ అయినా... హుందాగా సాగాలంటే ఆమె మాటలు తప్పకుండా వినపడాల్సిందే. వేల సంఖ్యలో సినీ ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ ఫుల్ చేసింది. వాక్ చాతుర్యం, టైమింగ్, యాంకరింగ్ స్కిల్స్ తో సౌత్ లో ప్రశంసలు అందుకుంది. ఆమె పేరు ఉంటేనే చాలు టీవీ షోలు కూడా సక్సెస్ ఫుల్ అనే రేంజ్ లో కెరీర్ ను బిల్డ్ చేసుకుంది. సుమ కనకాలను ఆదర్శకంగా తీసుకొని ఎంతో మంది యువకులు యాంకరింగ్ ను ప్రొఫెషన్ గా మార్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
అయితే, యాంకర్ సుమ టీవీ షోలు, ఈవెంట్లతో ఎప్పుడూ తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తన ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఖుషి చేస్తుంటుంది. ఇక ప్రత్యేకమైన రోజుల్లో సుమ కనకాల మరింత ఆసక్తికరంగా పోస్టులు పెడుతూ నెట్టింట కూడా తెగ సందడి చేస్తుంటుంది. ఇక తాజాగా సుమ పంచుకున్న ఓ స్పెషల్ వీడియా ఇప్పుడు వైరల్ గా మారింది. అది కూడా తన తల్లి గురించిన వీడియో కావడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఈ రోజు 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో సుమ కనకాల మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపింది. తాము ఎంచుకున్న రంగాల్లో మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా తన అభిమానులు, మహిళలు స్ఫూర్తి పొందేలా తన తల్లి గురించిన ఓ వీడియోను పంచుకుంది. ఇంట బయట పని ఒత్తిడితో సతమతమవుతున్న తోటీ మహిళామూర్తులకు చిన్న సందేశాన్ని అందించింది. ప్రతి మహిళా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరింది. అందుకు సరైనా డైట్ తో పాటు ఎక్సర్ సైజ్ లు, జిమ్ కు టైమ్ కేటాయించాలని సూచించింది.
సుమ తన తల్లి పరిచయం చేస్తూ 85 ఏళ్ల వయస్సులోనూ ఆమె జిమ్ లో చేస్తున్న వ్యాయామాలను చూపించింది. వెయిట్ లిఫ్టింగ్, సైక్లింగ్, వాకింగ్, పలు ప్రత్యేకమైన ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఆ పెద్దావిడ ఎంతో యాక్టివ్ గా కనిపించారు. తన ఆరోగ్యం పట్ల చూపిస్తున్నశ్రద్ధ ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. రెగ్యులర్ గా తన తల్లి ఉదయం వ్యాయామాలతో పాటు జిమ్ లోనూ వర్కౌట్స్ చేస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఆ స్ఫూర్తివంతమైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక సుమ కూడా రెగ్యులర్ గా జిమ్ లో వరౌట్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలను కూడా జిమ్ నుంచి షేర్ చేస్తూ ఉంటుంది. హెల్త్ పై శ్రద్ధ వహించాలని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటుంది. ఇక 30 ఏళ్లుగా సుమ టెలివిజన్ రంగంలో సేవలు అందిస్తున్నారు. టెలివిజన్ ప్రజెంటర్ గా, యాంకర్ గా ఎన్నో ఈవెంట్స్ సక్సెస్ చేసింది. మలయాళం మాతృభాష అయినప్పటికీ.. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలదు. ఇక సినిమాల్లోనూ సుమ కనకాల్లో మెరిసిన సంగతి తెలిసిందే. ఫీమేల్ లీడ్ చివరిగా 'జయమ్మ పంచాయతీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ప్రస్తుతం సుమా అడ్డాకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











