ఆ షోలో సుధీర్ ఫ్యాన్స్ రచ్చ.. యాంకర్ సుమకు గట్టిగానే సెగ తగిలింది.. అసహనంతో ఫైర్!!

సుధీర్‌ గురించి, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మామూలుగా స్టార్ హీరోల ఫ్యాన్స్ మంచి కాక మీదుంటారు. తమ హీరోను ఎవరైనా ఏదైనా అంటే చాలు విరుచుకుపడతారు. ఇక కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లాల్సిందే. ఇలా ఓ స్టార్ హీరోలకు జరుగుతుంటాయి. కానీ ఈ మధ్య సుడిగాలి సుధీర్ విషయంలోనే జరుగుతున్నాయి. దీన్ని బట్టి అతని స్టార్డం ఎక్కడికో వెళ్లిపోయిందని అర్థమవుతోంది. ఏకంగా సుమ కూడా అవాక్కయ్యే అంతటి ఫాలోయింగ్ సుధీర్ సొంతమైంది.

తీసుకోలేకపోతోన్న ఫ్యాన్స్..

తీసుకోలేకపోతోన్న ఫ్యాన్స్..

ఒకప్పుడు సుధీర్ మీద ఎన్ని సెటైర్లు, జోకులు, కించపరిచేలా కౌంటర్లు వేసినా అందరూ ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం సుధీర్ అభిమానులు వాటిని తీసుకోలేకపోతున్నారు. అలాంటి కౌంటర్లు సుధీర్ మీద వేస్తే హర్ట్ అవుతున్నారు. అంతే కాకుండా వేసిన వారిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ట్రోలింగ్ చేసి ఓ రేంజ్‌లో పిచ్చెక్కిస్తున్నారు.

తాజాగా బాబా భాస్కర్‌ను..

తాజాగా బాబా భాస్కర్‌ను..

తాజాగా బాబా భాస్కర్‌ను సుధీర్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ప్రతీసారి వేస్ట్ డబుల్ వేస్ట్ అంటూ కించపరిచేలా సెటైర్లు వేసేవాడు. వీడికి రెమ్యూనరేష్ అవసరమా అంటూ కౌంటర్లు వేశాడు. ఇక వీటిని చూసి చూసి విసుగు చెందిన సుధీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాబా మాస్టర్‌ను ఆడుకున్నారు. ఆ ట్రోలింగ్ దెబ్బకు సుధీర్ బెస్ట్ అంటూ పొగిడేశాడు. అందుకే ఈ సారి వచ్చిన ఢీ ప్రోమోలో సుధీర్‌పై సెటైర్లు వేయలేదు.

తాజాగా సుమ క్యాష్ షోలో...

తాజాగా సుమ క్యాష్ షోలో...

తాజాగా సుమ క్యాష్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. వచ్చే వారంలో టిక్ టాక్, యూట్యూబ్ స్టార్లను గెస్ట్‌లుగా పిలిచింది. ఇందులో దుర్గారావ్ జంట కూడా ఉంది. చందు సాయి, దీపిక, భాను భార్గవ్, షణ్ముఖ్, వైష్ణవీ ఇలా కొంత మంది వచ్చారు. అయితే వీరిని ఉద్దేశిస్తూ సుమ ఓ ప్రశ్న అడిగింది. బెస్ట్ యాంకర్ ఎవరిని మిమ్మల్ని అడిగి నాలుగు ఆప్షన్స్ ఇస్తే నా పేరే చెబుతారు కదా అని సుమ తనకు తానే హైప్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : జోర్దార్ సుజాత ఎలిమినేటెడ్!
సుధీర్ ఫ్యాన్స్ రచ్చ...

సుధీర్ ఫ్యాన్స్ రచ్చ...

అదే సమయంలో ఎవరి డబ్బా వారు కొట్టుకోవడం అంటే ఇదే అనే కామెంట్ వచ్చింది. ఎవడ్రా అలా అన్నది అంటూ సుమ ఫైర్ అవ్వగా సుధీర్ ఫ్యాన్స్ అంటూ ఓ కామెంట్ కనపడింది. మీరెందుకు ఇక్కడి వచ్చార్రా.. జబర్దస్త్‌లో చూసుకోండి.. నా షోలోకి వచ్చిన సుధీర్ అన్నకు జై కొట్టు అంటారేంట్రా అంటూ అసహనం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X