యాంకర్ సుమకు తప్పిన పెను ప్రమాదం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా.. వామ్మో షాకింగ్ వీడియో!
టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నెంబర్ యాంకర్ సుమకు పెను ప్రమాదం తప్పింది. టీవీ ప్రేక్షకులకు అనేక రకాల విభిన్నమైన షోలతో ఎంతగానో దగ్గరైన ఆమె ఇటీవల జయమ్మ పంచాయితీ అనే సినిమాతో వెండితెరపై కూడా అలరించడానికి వచ్చింది. ఇక ఆ సినిమా ప్రమోషన్ లో కూడా సుమ బిజీగా పాల్గొంటున్నారు. అయితే ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియోను యాంకర్ సుమ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

పెద్ద హీరోల కంటే ఎక్కువ క్రేజ్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోలు ఉన్నా వారిలో కొంతమంది అన్ని వర్గాల ప్రేక్షకులకు తెలియకపోవచ్చు.. కానీ యాంకర్ సుమ అంటే మాత్రం తెలుగు లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. టీవీ రంగంలోనే కాకుండా పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు వాటికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా సుమ ప్రత్యేకంగా హోస్ట్ చేసే విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది.

ఏకైక యాంకర్
వివాదాలు లేకుండా చాలా సింపుల్ గా ఉంటూ కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా కామెడీని అందించే ఏకైక యాంకర్ సుమ. ఇక ఆమె ఎలాంటి రియాలిటీ షో చేసినా కూడా తప్పకుండా టీఆర్పీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాయి. అప్పట్లో స్టార్ మహిళ ప్రోగ్రాం తో ఆమె 3300 ఎపిసోడ్లు పూర్తి చేసి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు లోనే అత్యధిక షోలకు యాంకర్ కొనసాగుతున్న ఏకైక వ్యక్తి సుమ అని చెప్పవచ్చు.

మొదట్లో అలా..
ఇక రీసెంట్ గా యాంకర్ సుమ చాలాకాలం తర్వాత వెండితెరపై కనిపించే ప్రయత్నం చేసింది. గతంలో ఆమె కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. కానీ అవన్నీ కూడా కేవలం అతిధి పాత్రలు. అంతేకాకుండా కెరీర్ మొదట్లో అయితే సుమ వెండితెరపై లీడ్ పాత్రలో కూడా కనిపించింది. కానీ అవి ఏవి కూడా అంతగా ఆమెకు గుర్తింపును ఎవ్వలేకపోయాయి. ప్రభాస్ వర్షం సినిమాలో సుమ హీరో సిస్టర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

జయమ్మ పంచాయతీ
అయితే ఇన్నాళ్లకు సుమ మళ్లీ లీడ్ పాత్రలో కనిపించింది. జయమ్మ పంచాయతీ అనే సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమ నటించిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సినిమాకు మొదటి రోజు కూడా మంచి ఓపెనింగ్స్ అందినట్లు సమాచారం.
తప్పిన ప్రమాదం
అయితే సుమ తనకు జరిగిన ఒక ప్రమాదం వీడియోను రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గతంలో ఆమె జయమ్మ పంచాయతీ షూటింగ్ స్పాట్ లో ఉండగా సరదాగా ఒక రాయిపై నడుస్తూ ఉండగా కిందపడిపోయింది. ఆ రాళ్ళకు నాచు పట్టి ఉండడంతో అది సరిగ్గా చూసుకోని ఆమె ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. ఏమాత్రం పట్టు తప్పిన కూడా తలకు గాయం అయి ఉండేది అని.. జాగ్రత్తగా ఉండాలి అని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











