హీరోగా యాంకర్ సుమ తనయుడు.. ఫస్ట్ సినిమా కోసమే ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్.. గ్రాండ్ ఎంట్రీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్స్ కంటే ఎక్కువగా క్రేజ్ అందుకున్న అతి కొద్దిమంది యాంకర్స్ లో సుమ ఒకరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కొంతమంది అగ్రహీరోలు పెద్దగా తెలియకపోవచ్చు కానీ సుమ మాత్రం తెలియకుండా ఉండదు. జనాల్లోకి ఈజీగా వెళ్లిపోయిన సుమ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటించే ప్రయత్నం చేస్తోంది. ఆమె లీడ్ రోల్ చేసిన జయమ్మ పంచాయితీ త్వరలోనే విడుదల కానుంది. ఇక ఇప్పుడు ఆమె తనయుడు కూడా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు అతని మొదటి సినిమా కోసమే ఇద్దరు టాలెంటెడ్ దర్శకులను రంగంలోకి దింపుతుండడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

సుమ ఉంటే హిట్టే..

సుమ ఉంటే హిట్టే..

తెలుగు టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుమా ఎలాంటి రియాలిటీ షోలో కనిపించిన కూడా మంచి రేటింగ్స్ అందించడంలో ముందుంటుంది. ముఖ్యంగా అగ్రహీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ఆమె ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సుమ ఈవెంట్స్ హోస్ట్ గా ఉంటే.. ఈవెంట్ మాత్రం సగం హిట్ అయినట్లే అని ఇండస్ట్రీలో ఒక మంచి టాక్ అయితే ఉంది.

అలా కెరీర్ సెట్ చేసుకున్న సుమ

అలా కెరీర్ సెట్ చేసుకున్న సుమ

యాంకర్ సుమ మొదట టెలివిజన్ నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా ఆమె సైడ్ క్యారెక్టర్స్ లో నటించింది. ప్రభాస్ వర్షం సినిమాలో కూడా సోదరి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హోస్ట్ గా వ్యవహరించిన అనంతరం టెలివిజన్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది.

 అత్యధిక రెమ్యునరేషన్

అత్యధిక రెమ్యునరేషన్

టెలివిజన్ రంగంలో ఉండగానే నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమ ఆ తర్వాత టెలివిజన్ రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ తన స్థాయిని కూడా అంతకంతకూ పెంచుకుంటూనే ఉంది. ఒకవైపు భార్యగా తల్లిగా మంచి యాంకర్ గా కూడా అన్ని బాధ్యతలకు సమన్యాయం చేస్తూ వచ్చింది. ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లకు వెళ్లకుండా సుమ చాలా కూల్ గా కెరీర్ ను ముందుకు కొనసాగించింది. ప్రస్తుతం యాంకర్స్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో సుమ టాప్ పోజిషన్ లో ఉంది అనే చెప్పాలి.

హీరోగా సుమ తనయుడు

హీరోగా సుమ తనయుడు

అయితే ఇప్పుడు సుమ కుమారుడు రోషన్ కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇదివరకే అతను హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. తర్వాత ఒక కొత్త దర్శకుడితో 2020 నవంబర్ లో కూడా ఒక సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు అఫీషియల్గా క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.

మంచి కథ కోసం

మంచి కథ కోసం

అయితే ఇప్పుడు సుమ రాజీవ్ కనకాల ఇద్దరు కూడా కొడుకు గ్రాండ్ గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సుమ రాజీవ్ కనకాల ఇద్దరూ కూడా కొడుకు ఎంట్రీ కోసం చాలా కథలు విన్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రముఖ దర్శకుల దగ్గర సహాయకులుగా వర్క్ చేసిన వారి దగ్గర నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న కథలను విన్నారు. అయితే మొదటి సినిమా అద్భుతంగా కంటెంట్ తో కూడుకున్నది అయి ఉండాలి అని రాజీవ్ కనకాల తన అనుభవంతో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదటి సినిమా కోసం యువ దర్శకులు

మొదటి సినిమా కోసం యువ దర్శకులు

ఇక రీసెంట్ గా సుమ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు ఫిదా అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతనికి ఫుల్ కమిట్మెంట్స్ ఉండడం వలన దర్శకత్వం చేసే అవకాశం లేక పోయిందట. దీంతో రాజీవ్ కనకాల మరొక యువ టాలెంటెడ్ దర్శకుడిని రంగంలోకి దింపుతున్నాడు. అతను మరెవరో కాదు ఉయ్యాల జంపాల, నాని మజ్ను సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విరించి వర్మ అని తెలుస్తోంది. మరి రోషన్ ను ఈ యువ దర్శకుడు ఎలా లాంచ్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X