Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆడవాళ్లకు పొద్దున ఆ పని.. మగాళ్లకు రాత్రి ఆ పని.. సుమతో అంత వీజీ కాదు!!
బుల్లితెరపై సుమ తెలుగు నాట సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. సుమ అంటే మహిళా లోకానికి ఓస్ఫూర్తి. వంటింటి కుందేళ్లలా ఉండే మహిళలను బుల్లితెరపైకి తీసుకొచ్చి వారిని ఆడించింది.. పాడించింది. స్టార్ మహిళ ప్రోగ్రాంతో ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకుంది. థ్రీ థౌజండ్ ప్లస్సు అనే సుమ మ్యానరిజం ఇప్పటికీ ఓ ట్రెండే. నిరవధికంగా 3,181 ఎపిసోడ్లతో షోను రన్ చేయడంతో సుమ అందర్నీ ఆశ్చర్యపరిచింది.
మహిళల షో...
స్టార్ మహిళకు షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండింటి వరకు సాగే ఈ షోలో మహిళల సందడి ఓ రేంజ్లో ఉండేది. ఇక ఈ షోలో సుమ వేసే పంచ్‌లు, ఆడించే ఆటలు మామూలుగా ఉండేవి కాదు. అయితే ఈ షోను మధ్యలో నిలిపివేశారు. ఇక అన్ని ఎపిసోడ్లు చేయడమూ ఓ రికార్డే.
మళ్లీ పున: ప్రారంభం..
స్టార్ మహిళను మళ్లీ ప్రారంభించబోతోన్నారని తెలిసిందే. ఆ మధ్య సుమపై షూట్ చేసిన ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేయగా అది తెగ వైరల్ అయింది. కాలా సినిమాలో రజినీ స్టైల్లో అదిరే పోజు పెట్టింది. అంతేకాకుండా చివర్లోనూ ఓ డైలాగ్ వదిలింది. ఇక చూస్తారుగా ఈ సుమ ఆడించే ఆట అంటూ దుమ్ములేపింది.
వైరల్ ప్రోమో..
స్టార్ మహిళకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోలో మొదటగా ఢీ కంటెస్టెంట్లు, కొందరు యాంకర్లను తీసుకున్నారు. ఇక వీరిని తన పంచ్‌లతో ఓ రేంజ్లో ఆడుకుంది సుమ. వింత వింత టాస్కులు ఇచ్చి చుక్కలు చూపించింది.
Recommended Video
చుక్క వేయడం..
ఇక ఈ షోలో మొదటగా మహిళలందరికీ పూలు కుచ్చడం, దండ అల్లడం అనే టాస్కును ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక అందులో వచ్చిన వారికి అవి ఏ పూలో కూడా తెలియనట్టుంది. ఆ పేర్లను వారితో పలికించడంలో సుమ నానా తంటాలు పడింది. ఇక తదుపరిగా ముగ్గులు వేయడం అనే టాస్కును ఇచ్చింది. అందులో భాగంగా సుమ వేసిన పంచ్ తెగ వైరల్ అవుతోంది. పొద్దున లేస్తే ఆడవాళ్లు చుక్కలు వేస్తారు.. రాత్రి అయితే మగవారు చుక్కలు వేస్తారు అంటూ సెటైర్ వేసింది. ఏది ఏమైనా సుమను, ఆమె వేసే పంచ్‌లను తట్టుకోవడం కష్టమే.