Anchor Suma: కోట్ల రూపాయలు నష్టం.. ఆ విషయంలో సుమ అప్సెట్.. అందుకే వెనుకడుగు!
తెలుగు టెలివిజన్ రంగంలో మంచి యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి షో చేసినా కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ మంచి రేటింగ్స్ అందించగల సుమ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆమె ఒక విషయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కోట్ల రూపాయల నష్టం కలగడంతో ఇటీవల కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు వేగంగా నేర్చుకొని..
మొదట టెలివిజన్ రంగంలో నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన సుమ ఆ తర్వాత సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తెలుగు చాలా బాగా నేర్చుకుని మంచి యాంకర్ గా స్థిరపడిపోయింది మొదట్లోనే హీరోయిన్ గా కూడా ఒక సినిమా చేసింది కానీ అదేమీ అంతగా సక్సెస్ కాలేదు.

అలా యాంకర్ గా..
అయితే యాంకర్ సుమ మొదట అనుకోకుండా ఒక కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆడియో ఈవెంట్ తో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లో యాంకర్ సుమ మంచి హోస్ట్ గా కొనసాగుతూ ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యాంకర్ గా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది.

సుమ డామినేషన్
ప్రస్తుతం ఒక రియాల్టీ షో ఎపిసోడ్ ము దాదాపు ఒక లక్షకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఉండాలి సుమ ఉండాలి అంటే ఆమెకు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.. దాదాపు పెద్ద సినిమాలన్నిటికీ కూడా యాంకర్ సుమ ని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆమెకు పోటీగా కొంతమంది బ్యూటిఫుల్ యాంకర్స్ ఉన్నప్పటికీ కూడా పెద్ద సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ను దక్కించుకోలేక పోతున్నారు.

జయమ్మ పంచాయితీ
అయితే చాలా కాలం తర్వాత యాంకర్ సుమ వెండితెరపైకి సరికొత్త గారి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె జయమ్మ పంచాయతీ అనే ఒక సినిమాలో నటించారు. ఆ సినిమాకు విడుదలకు ముందు చాలా బాగా బజ్ క్రియేట్ చేయడంతో సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని కూడా సుమ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది.
Recommended Video


భారీగా నష్టాలు
అయితే ఆ సినిమా థియేట్రికల్ గా నాలుగున్నర కోట్ల వరకు బిజినెస్ చేయగా సగానికి పైగా నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడికి దాదాపు రెండు కోట్ల వరకు నష్టాలు రావడంతో యాంకర్ సుమ ఆ విషయంలో తీవ్రంగా అప్సెట్ అయినట్లు కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది.

ఆఫర్లు వస్తున్నాయి.. కానీ..
అయితే ఇటీవల సుమకు లీడ్ రోల్ లో నటించే మరి కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయట. కొంతమంది చిన్న నిర్మాతలు ఆమెకు భారీగా మంచి పారితోషికం కూడా ఇస్తామని కొన్ని ప్రాజెక్టులను ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే జయమ్మ పంచాయతీ తీవ్రంగా నష్టాలకు గురి చేయడంతో ఆమె ఇప్పుడు అలాంటి ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. టెలివిజన్ రంగంలో మంచి క్రేజ్ ఉండటంతో ఇప్పుడు సినిమాల కారణంగా ఆ క్రేజ్ కూడా పోకూడదు అని సుమ కొంత కాలం పాటు వెండితెరకు దూరంగానే ఉండాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











