రెమ్యునరేషన్‌తో పాటు అది కూడా.. ఇంట్లోనే గొడ్డు చాకిరి.. సుమ వీడియో వైరల్
మహిళా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటోంది. మన టాలీవుడ్ స్టార్స్ సైతం తమ జీవితాల్లోని మహిళలను స్మరించుకుంటూ మహిళా లోకాని ఉమెన్స్ డే విషెస్ తెలిపారు. మహేష్ బాబు, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు సోషల్ మీడియాలో స్పందించారు.
Recommended Video


క్షణం తీరిక లేకుండా..
తెలుగు నాట యాంకర్ అంటే చిన్నపిల్లడికైనా గుర్తుకు వచ్చేది కేవలం సుమనే. తరాలు మారుతున్నా.. సుమ మాత్రం మారడం లేదు. అలుపన్నదే లేకుండా తన వాగ్దాటితో అందర్నీ ఆకట్టుకుంటోంది. మహిళా దినోత్సవం సందర్భంగా సుమ ఓ సందేశాన్ని పంపింది.

వీడియోతో సందేశం..
తాజాగా యాంకర్ సుమ కూడా స్పందించింది. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ఓ సందేశాన్ని ఇచ్చింది. నిత్యం బిజీగా ఉండే సుమ.. కారులో ప్రయాణిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. స్టార్ మహిళా అంటూ సుదీర్ఘమైన కార్యక్రమాన్ని హోస్ట్ చేసి రికార్డులకెక్కిన సుమ ఏ సందేశమిచ్చిందో ఓ సారి చూద్దాం.

మేకప్ లేకుండా..
మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వీడియో పెట్టాలని అనుకున్నానని వెంటనే ఓ ఆలోచన వచ్చిందని తెలిపింది. ఈ రోజు మేకప్ వేసుకోలేదు కదా.. వేసుకోకపోతే ఎలా అనుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే, మేకప్ లేకపోతే సుమ ఇలా ఉంటుంది.. కళ్లేంటి కొంచెం డల్‌గా ఉన్నాయి? అని రకరకాలుగా అంటారని పేర్కొంది. ఇది తన కష్టార్జితమని... రెమ్యునరేషన్‌తో పాటు ముఖం ఇలా మారిపోతూ ఇలాంటి ప్రతిఫలాలు కూడా వస్తుంటాయని ఫన్నీగా చెప్పుకొచ్చింది.

ఇంట్లోనే గొడ్డు చాకిరి చేస్తుంటారు
ఇలా ఎంతో మంది మహిళలు తమ ఇంటిని, వర్క్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారని తెలిపింది. ఇంకొంతమంది ఇంట్లోనే గొడ్డు చాకిరి చేస్తుంటారని, వారిపై కూడా కామెంట్లు చేస్తుంటారని అంది. ఏంటీ నల్లబడ్డావు.. బాగా చిక్కిపోయావేంటీ? బాగా లావయ్యావేంటీ? అంటుంటారని పేర్కొంది. బయటి నుంచి వచ్చే కామెంట్లను మనం మార్చలేమని.. ఎలాంటి కామెంట్లు వచ్చినా మనం ఇలాగే ఉండాలని తెలిపింది. ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా మహిళలంతా మారొద్దు.. ఆనందంగా ఉండండని సూచించింది. చివరకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలిపింది.


Click it and Unblock the Notifications











