twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోతావురా.. పోతావు.. దొంగచాటుగా ఉండొద్దు.. క్లాస్ పీకిన యాంకర్ సుమ

    |

    కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రభుత్వాలు దానిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్లపైకి రావడం, అలాగే విదేశాల నుంచి వచ్చి తగిన చికిత్సలకు హాజరకుకాకపోవడం పరిస్థితిని దిగజార్చే విధంగా చేస్తున్నది. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ తన సామాజిక బాధ్యతగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఇంతకు ఆ వీడియోలో ఇచ్చిన సలహాలు ఏమిటంటే..

    Recommended Video

    Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
    అనవసరంగా రోడ్లపైకి..

    అనవసరంగా రోడ్లపైకి..

    ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. కొంతమంది మాత్రం బాధ్యతారాహిత్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. రోడ్ల మీద తిరగడానికి మీకు అంత అవసరం ఏమున్నది? ప్రజలు బయట తిరగడం వల్ల కరోనావైరస్ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తమవుతుంటే.. మీరు రోడ్లపైకి రావడం సమంజసమా అని యాంకర్ సుమ తన వీడియోలో సూచించారు.

    ఇంటికే పరిమితం కావాలి..

    ఇంటికే పరిమితం కావాలి..

    కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందితే పోతావురా.. పోతావు అంటూ హెచ్చరిస్తున్నా పట్టించుకోరేమిటి? కాబట్టి పెద్దల సూచనలు, సలహాలను వింటూ ఇంటికే పరిమితం కావాలి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, వైద్యులు, పోలీసులు, మీడియా అందరూ తమ విధులను నిర్వహించడానికి బయటకు రావాలి కాబట్టి.. మిగతా వారందరూ ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి అని సుమ కోరారు.

    విదేశాల నుంచి వచ్చి..

    విదేశాల నుంచి వచ్చి..

    విదేశాల నుంచి వచ్చిన వారు తమ పేర్లను నమోదు చేయించుకోకుండా ఇంట్లో దొంగచాటుగా ఉంటున్నారు. అలాంటి వాళ్లు స్వయంగా డిక్లేర్ చేసుకొంటూ ప్రభుత్వానికి సహకరించాలి. మీరు అలా చేయడం వల్ల దేశానికి గొప్ప ఉపకారం చేసిన వారువుతారు. దయచేసి మీరు మీ వివరాలను ప్రభుత్వానికి అందజేసి దేశానికి మేలు చేయండి అంటూ సుమ పేర్కొన్నారు.

     ఇంట్లోనే ఉండండి..

    ఇంట్లోనే ఉండండి..

    కరోనా వ్యాధి ప్రాణాంతకం. ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుంటుంది. ఒకరి నుంచి మరొకరికి.. అలా చైన్ స్టిస్టం మాదిరిగా రెండింతలు, మూడింతలు పెరిగే ప్రమాదం ఉంది కనుక.. మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి.. కరోనా వ్యాప్తి నిరోధానికి మీ వంతుగా సహాయం అందించండి అని సుమ సలహా ఇచ్చారు.

    English summary
    Anchor Suma warns citizen not to behave irresponsible in dangerous situation. She give some suggestions Lockdown, coronavirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X