twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యపై నిలబెట్టి గెలిపిస్తానని షాకిచ్చాడు... యాంకర్ సంచలనం

    |

    టీవీ యాంకర్‌గా, మహిళా పాత్రికేయురాలిగా పాపులర్ అయిన శ్వేతా రెడ్డి ఇటీవల కెఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకు తమ పార్టీ తరుపున హిందూపురం ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తున్నట్లు కూడా పాల్ ప్రకటించారు.

    పాల్ పార్టీలోకి వెళ్లిన తర్వాత శ్వేతారెడ్డికి ఊహించని షాక్స్ తగిలాయి. దీంతో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాల్ మీద సంచలన కామెంట్స్ చేశారు. శ్వేతా రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

    పాల్ మీద మండి పడ్డ యాంకర్ శ్వేతా రెడ్డి

    పాల్ మీద మండి పడ్డ యాంకర్ శ్వేతా రెడ్డి

    ఇటీవల వైజాగ్ మీటింగులో... ‘శ్వేతా రెడ్డి 10వేల సభ్యత్వం తీసుకొస్తానని చెప్పి ఇప్పటి వరకు అడ్రస్ లేదని' పాల్ చెప్పడంపై ఆమె మండి పడ్డారు. అసలు ఆ మీటింగులో తన ప్రస్తావన పాల్ ఎందుకు తెచ్చారో అర్థం కావడం లేదన్నారు.

    మిమ్మల్ని కామెడీ పీస్‌గా చూస్తున్నపుడు...

    మిమ్మల్ని కామెడీ పీస్‌గా చూస్తున్నపుడు...

    నేను ప్రజాశాంతి పార్టీలో చేరినపుడు చాలా మంది ఏ నమ్మకంతో వెళ్లారు, ఆ పార్టీకి సింబల్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు, సరైన సిద్ధాంతం లేదు, సోషల్ మీడియాలో కూడా ఆయన్ను కామెడీ పీస్‌గా చూస్తున్నారు అని కొందరు అన్నపుడు విన్రమంగా ఒకటే మాట చెప్పాను... మంచి మనుషులు సేవ చేయడానికి వచ్చినపుడు ప్రజలు ఇలాగే చూస్తారు అని చెప్పాను. ఆ మాటను నేను ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్లు శ్వేతా రెడ్డి తెలిపారు.

    బాలయ్యపై గెలిపిస్తానన్నారు..

    బాలయ్యపై గెలిపిస్తానన్నారు..

    హిందూపూర్ నియోజకవర్గం నుంచి సిస్టర్‌ను గెలిపించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అక్కడ బాలకృష్ణ ఉన్నా, ఇంకెవరు ఉన్నా గెలిపాస్తా అని పాల్ చెప్పినట్లు... శ్వేతా రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడేమో ఆయన తీరు చూసి షాకైనట్లు తెలిపారు.

    సోషల్ మీడియాలో హాట్ టాపిక్

    సోషల్ మీడియాలో హాట్ టాపిక్

    కెఏ పాల్ పార్టీలో చేరి శ్వేతారెడ్డి ఎదుర్కొన్న చేదు అనుభవం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జర్నలిస్టుగా పని చేసి ఆమె కెఏ పాల్‌ను నమ్మి ఆ పార్టీలో చేరడం, అది కూడా బాలయ్య లాంటి స్టార్ మీద గెలిపిస్తాననే పాల్ మాటలు నమ్మి చివరకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడంపై రకరకాలుగా చర్చించుకంటున్నారు.

    English summary
    Anchor Swetha Reddy comments KA Paul about Hindupuram MLA Ticket. Kilari Anand Paul is a Christian evangelist from Southern India. Paul launched a political party by the name Praja Shanthi Party in 2008.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X