Anchor Syamala husband arrest: డబ్బు అడిగితే చంపేస్తానని ఫిర్యాదు.. భర్త వివాదంపై యాంకర్ శ్యామల
చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త లక్ష్మీ నరసింహారెడ్డి అరెస్ట్ కావడం వివాదంగా మారింది. వ్యాపారం విషయంలో ఓ మహిళను లక్షలాది రూపాయలు చీట్ చేశారనే ఆరోపణలపై నరసింహారెడ్డిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై యాంకర్ జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్‌తో మాట్లాడారు. ఈ వివాదం గురించి వివరాల్లోకి వెళితే. ..
రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

సింధూరా రెడ్డితో అగ్రిమెంట్
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా సింధూరా రెడ్డితో యాంకర్ శ్యామల లక్ష్మీ నరసింహారెడ్డి అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం.. గండిపేటకు సమీపంలోని నాలుగు ఎకరాల వెంచర్ కోసం 1 కోటి రూపాయల పెట్టుబడి పెట్టాలని వారిద్దరి మధ్య ఒప్పందం జరిగింది అని సైబారాబాద్ పోలీసులు తెలిపారు.

డబ్బు వాపసు చేయమంటే చంపేస్తానని
అయితే సింధూర, నరసింహారెడ్డి మధ్య జరిగిన ఒప్పందం తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. దాంతో వెంచర్‌కు సంబంధించిన డెవలప్‌మెంట్ చేయడం లేదని, ఆ తర్వాత డబ్బు వాపసు ఇవ్వమంటే చంపివేస్తామని బెదిరించారు అని ఆరోపిస్తూ నరసింహారెడ్డిపై సింధూర ఫిర్యాదుచేశారు అని పోలీసులు పేర్కొన్నారు.

85 లక్షలు చెల్లించానంటూ...
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నరసింహరెడ్డితో జరిగిన ఒప్పందం ప్రకారం క్యాష్, చెక్కుల రూపంలో రూ.85 లక్షలను సింధూరా చెల్లించింది. ఆ డబ్బుతో స్విమ్మింగ్ పూల్; పబ్, గేమ్ జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పి చేయించలేదు. డబ్బు చెల్లించినా వెంచర్‌కు సంబంధించిన అభివృద్ధి పనులు కొనసాగించలేదని సింధూర ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు.

ఏం జరిగిందో తెలియదంటూ శ్యామల
తన భర్త అరెస్ట్‌పై యాంకర్ శ్యామల స్పందిస్తూ.. సింధూర, నరసింహారెడ్డి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ వివాదం గురించి నాకు పూర్తి వివరాలు తెలియదు. ఆమె ఎందుకు కేసు ఫైల్ చేసిందో కూడా తెలియదు. ఆ వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారం నాకు తెలియదు అని యాంకర్ శ్యామల పేర్కొన్నారు.
Recommended Video

బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నానంటూ..
కొవిడ్ పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం నా కొడుకు, ఫ్యామిలీ సంరక్షణ నేనే చూసుకొంటున్నాను. ఇలాంటి పరిస్థితుల మధ్య మా ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత నా భర్తతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెబుతాను అని యాంకర్ శ్యామల పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











