భర్తకు యాంకర్ శ్యామల విడాకులు: అందుకే ఆయన కనిపించట్లేదు అంటూ అసలు విషయం చెప్పేసింది

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా పని చేస్తున్నారు. అందులో కొందరు మాత్రమే మంచి గుర్తింపును అందుకుని సత్తా చాటుతున్నారు. తద్వారా వరుస ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో యాంకర్ శ్యామల ఒకరు. అప్పుడెప్పుడో నటిగా టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత హోస్టుగా మారిపోయింది. టీవీ యాక్టర్‌ను ప్రేమ వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్యామల విడాకులు తీసుకుందని ఓ వార్త వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.

అలా పరిచయం.. ఆ రెండింటిలోనూ అడుగు

అలా పరిచయం.. ఆ రెండింటిలోనూ అడుగు


సీరియల్ నటిగా బుల్లితెరపైకి అడుగు వేసింది శ్యామల. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'లయ', 'అభిషేకం' వంటి ధారావాహికల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలతో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే 'లౌక్యం', 'ఒక లైలా కోసం', 'గుండెల్లో గోదారి' సహా పలు సినిమాల్లో కూడా నటించింది.

సీరియల్ యాక్టర్‌తో లవ్ ట్రాక్... వివాహంతో

సీరియల్ యాక్టర్‌తో లవ్ ట్రాక్... వివాహంతో


వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తున్న సమయంలోనే యాంకర్ శ్యామల.. బుల్లితెరపై సత్తా చాటుతోన్న నటుడు నరసింహాతో లవ్‌లో పడిపోయింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ షోలోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చింది

బిగ్ బాస్ షోలోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చింది

యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న శ్యామల.. మూడేళ్ల క్రితం జరిగిన బిగ్ బాస్ రెండో సీజన్‌లో శ్యామల కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, అనుకోని విధంగా ఆమె షో మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, ప్రేక్షకుల ఓట్లతో ఆ వెంటనే మరోసారి షోలోకి రీఎంట్రీ ఇచ్చేసింది. అయినప్పటికీ యాంకర్ శ్యామల ఫినాలేకు కూడా చేరుకోలేకపోయింది.

పాలిటిక్స్‌లోకి ప్రవేశం... ఆయన విజయంలో

పాలిటిక్స్‌లోకి ప్రవేశం... ఆయన విజయంలో

బిగ్ బాస్ షో తర్వాత తన పంథాను మార్చుకున్న శ్యామల.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో 2019 ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు భర్తతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎన్నికల సమయంలో వీళ్లిద్దరూ కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. తద్వారా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతుంది

తెలంగాణ రాజకీయాల్లో కీలకం కాబోతుంది

గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన యాంకర్ శ్యామల.. కొన్ని రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పెట్టబోతున్న పార్టీలో ఆమె చేరబోతుందన్న వార్తలే. కొద్ది రోజుల క్రితం శ్యామల తన భర్తతో కలిసి బ్రదర్ అనిల్‌తో పాటు షర్మిలతోనూ భేటీ అవడంతో ఈ పుకార్లు వచ్చాయి.

యాంకర్ శ్యామల విడాకులు తీసుకుందని

యాంకర్ శ్యామల విడాకులు తీసుకుందని

యాంకర్ శ్యామల విడాకులు తీసుకుందని తరచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. 'మేము విడాకులు తీసుకున్నామని ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. నాలుగైదు సార్లు మమ్మల్ని నెటిజన్లే విడగొట్టేశారు. దీంతో ఇది నిజమేనని చాలా మంది అనుకున్నారు. కానీ, మేము కలిసి కనిపించగానే అబద్ధం అనుకుంటున్నారు' అని చెప్పుకొచ్చిందామె.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
అందుకే ఆయన కనిపించట్లేదంటూ క్లారిటీ

అందుకే ఆయన కనిపించట్లేదంటూ క్లారిటీ

దీనిని కొనసాగిస్తూ.. 'నా భర్త చాలా రిజర్వ్‌డ్ పర్సన్. అందుకే ఎప్పుడూ ఎక్కడికీ రాడు. ఈ కారణంగానే ఎక్కువగా నేనొక్కదాన్నే కనిపిస్తుంటా. అందుకే ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి. వీటికి పుల్‌స్టాప్ పెట్టాలనే మేమిద్దరం కలిసి ఇటీవల ఓ కవర్ సాంగ్ చేశాం. దీంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. నన్ను ఇష్టపడే వాళ్ల కోసమే ఈ క్లారిటీ ఇస్తున్నా' అంటూ శ్యామల క్లారిటీ ఇచ్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X