యాంకర్ శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్ బంధువా: బయటకొచ్చిన షాకింగ్ న్యూస్.. ఆమె రియాక్షన్ అదుర్స్

తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్లలో శ్యామల ఒకరు. నటిగా కెరీర్‌ను ఆరంభించి.. యాంకర్‌గా స్థిర పడిన ఆమె.. దాదాపు పదేళ్లుగా పలు రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోందామె. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. రాజకీయాల్లోనూ కాలు మోపింది. ఇక, ఇటీవలే ఆమె భర్త ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో శ్యామలకు.. టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ బంధువు అవుతాడన్న వార్త బయటకు వచ్చింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఫేమస్

అలా మొదలైన ప్రయాణం.. ఇలా ఫేమస్

టీనేజ్‌లోనే నటిగా బుల్లితెరపైకి అడుగు పెట్టింది శ్యామల. ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపును అందుకుంది. ఆమె నటించిన సీరియళ్లలో 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటివి పేరు తెచ్చాయి. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. అలాగే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' సహా పలు సినిమాల్లో కూడా నటించింది.

 ఆ నటుడితో ప్రేమ... ఎదురించి వివాహం

ఆ నటుడితో ప్రేమ... ఎదురించి వివాహం

వరుస ఆఫర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే యాంకర్ శ్యామల.. బుల్లితెరపై సత్తా చాటుతోన్న నటుడు నరసింహాతో ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించిన సంగతి తెలిసిందే.

రాజకీయాల్లోకి ఎంట్రీ.. రెండిట్లోనూ కాలు

రాజకీయాల్లోకి ఎంట్రీ.. రెండిట్లోనూ కాలు

సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న యాంకర్ శ్యామల.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలతోనూ సమావేశం అయింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

పెద్ద వివాదంలో చిక్కుకున్న శ్యామల భర్త

పెద్ద వివాదంలో చిక్కుకున్న శ్యామల భర్త

శ్యామల భర్త నరసింహా రెడ్డి ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బుల్లితెరపై కలకలం రేగింది. ఈ ఘటనపై యాంకర్ శ్యామల కూడా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా తన భర్తకు బాసటగా నిలిచింది. ఈ మేరకు కొన్ని పోస్టులను కూడా పెట్టింది.

ఎప్పుడూ అందులోనే ఉంటూ హట్ టాపిక్

ఎప్పుడూ అందులోనే ఉంటూ హట్ టాపిక్

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది శ్యామల. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తరచూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను వదులుతోంది. ఇక, ఈ మధ్య తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు కూడా నిర్వహిస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్ బంధువా

శ్యామలకు క్రికెటర్ భువనేశ్వర్ బంధువా

తాజాగా సోషల్ మీడియాలో శ్యామలకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఈ యాంకరమ్మకు టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంధువు అవుతాడట. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ అవుతోంది. అందులో 'మీకు తెలుసా? యాంకర్ శ్యామల భువనేశ్వర్ కుమార్‌లు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు' అని అందులో వీళ్లిద్దరి ఫొటోలు జత చేశారు.

బయటకొచ్చిన షాకింగ్ న్యూస్.. రియాక్షన్

బయటకొచ్చిన షాకింగ్ న్యూస్.. రియాక్షన్

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్యామలకు తెలిసేలా ట్యాగ్ చేశాడు. దీంతో దీనిపై ఆమె స్పందించింది. ఈ మేరకు ఆ ఫొటోను షేర్ చేస్తూ 'ఆ విషయం నాకే తెలీదు.. ఇంక వాళ్లకేం తెలుస్తుంది' అంటూ సెటైర్ వేసింది. తద్వారా ఇది ఫేక్ వార్త అని తేల్చి పడేసింది. శ్యామల ఇచ్చిన కౌంటర్ స్క్రీన్ షాట్లు కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X