Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అన్ని విషయాలు అక్కడే బయటపెడతా: బిగ్‌బాస్ ఎలిమినేషన్‌పై శ్యామల భావోద్వేగం
Recommended Video
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎవరూ ఊహించని విధంగా యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యారు. ఇంట్లో అందరితో బావుంటూ, ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తున్న శ్యామల ఇలా అర్దాంతరంగా బయటకు వస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిమానులు మాత్రమే కాదు... శ్యామల కూడా తాను ఎలిమినేట్ అవుతానని భావించలేదట. ఇంటికి వచ్చిన అనంతరం అభిమానుల కోసం ఎఫ్బి లైవ్‌లోకి వచ్చిన శ్యామల భావోద్వేనికి గురయ్యారు.
అప్పుడే ఎలిమినేట్ అయ్యాననే బాధ ఉంది
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత అయ్యో అప్పుడే వచ్చేశానే అనే బాధ ఉంది. కానీ సోషల్ మీడియాలో అభిమానెల కామెంట్స్ చూసిన తర్వాత ఎలిమినేట్ అయిన బాధ పోయింది. నా మీద ఇంత ప్రేమ చూపించడం ఆనందంగా ఉంది... అని శ్యామల తెలిపారు.
ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తెలియదు
ఎందుకు ఎలిమినేట్ అయ్యాను? అసలు ఏం జరిగిందో తెలియదు. ఇంటి సభ్యులంతా చాలా బాగా వీడ్కోలు చెప్పారు. ఏ ఒక్కరూ కూడా హమ్మయ్య వెళ్లి పోయిందని ఫీలవ్వలేదు. అందుకు చాలా ఆనందంగా ఉంది. అభిమానులంతా నాకు సపోర్టుగా ఉండటం సంతోషంగా ఉంది.... అని శ్యామల వ్యాఖ్యానించారు.
అన్ని విషయాలు అక్కడే బయటపెడతా
చాలా ఛానల్స్ ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగింది అనేది అక్కడే చెబుతానని శ్యామల తెలిపారు. కౌశల్ మీద పబ్లిక్కు క్లారిటీ ఇవ్వండి అని ఓ అభిమాని కోరగా... అందరి గురించి టీవీ ఛానల్ లోనే చెబుతాను అని తెలిపారు.
నేనూ షాకయ్యా, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా
మీరు ఎలిమినేట్ అయ్యారు, ఇకపై బిగ్ బాస్ షో చూడము అని ఓ అభిమాని కామెంట్ పై శ్యామల స్పందిస్తూ.... మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరు షాకైనట్లే నేనూ షాకయ్యాను. నేను ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదన్నారు.