చీటింగ్ కేసుపై మొదటిసారి స్పందించిన యాంకర్ శ్యామల భర్త.. జరిగింది ఇదే.. ఆ నిజాలు బయటకు వస్తాయి!

ఇటీవల చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త లక్ష్మీ నరసింహారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న లక్ష్మీ నరసింహా రెడ్డిపై పలు బెదిరింపు ఆరోపణలు కూడా రావడంతో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే యాంకర్ శ్యామల ఈ విషయంపై వివరణ ఇవ్వగా భర్త లక్ష్మీ నరసింహా కూడా వివరణ ఇచ్చారు.

ఆ విషయంలో తేడా రావడంతో..

ఆ విషయంలో తేడా రావడంతో..

వెంచర్ కు సంబంధించిన డబ్బుల విషయంలో తేడా రావడంతో నరసింహారెడ్డిపై సింధూర ఫిర్యాదు చేశారు. ఇటీవల సైబరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా విషయం ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. లక్షల మోసం జరిగినట్లు కూడా మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి.

చంపివేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు

చంపివేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు

గండిపేటకు సమీపంలో ఉన్న 4 ఎకరాల వెంచర్ కోసమని దాదాపు 1 కోటి రూపాయల పెట్టుబడితో ఒప్పందం జరిగిందని సైబారాబాద్ పోలీసులు తెలిపారు. ఆ తరువాత అభిప్రాయబేధాల కారణంగా వెంచర్‌కు సంబంధించిన డెవలప్‌మెంట్ చేయడం లేదని, అలాగే తీసుకున్న డబ్బు కూడా ఇవ్వడం లేదని, చంపివేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తూ సింధూర ఫిర్యాదుచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అన్ని నిజాలు బయటకు వస్తాయి

అన్ని నిజాలు బయటకు వస్తాయి

ఇక ఈ విషయంపై శ్యామల భర్త మాట్లాడుతూ.. గత రెండు రోజుకుగా నాపై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే వాటిపై క్లారిటీ ఇవ్వడానికి సరైన ఆధారాలతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అన్ని నిజాలు బయటకు వస్తాయి. నాకు జస్టిస్ పై నాకు నమ్మకం ఉంది.

ఇది తప్పుడు కేసు మాత్రమే

ఇది తప్పుడు కేసు మాత్రమే

ఇది మోసపూరిత కేసు మాత్రమే. అందుకు ఉదాహరణ నేను రెండే రెండు రోజుల్లో మీ ముందుకు వచ్చాను. దీన్ని బట్టి మీకు అసలు విషయం అర్థమై ఉంటుంది. ఇది తప్పుడు కేసు మాత్రమే. నాపై వచ్చిన ఆరోపణల్లో అయితే ఎలాంటి నిజం లేదు. ఇలాంటి తప్పుడు కేసులపై నిజానిజాలు బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మరో రెండు రోజుల్లో మీ ముందుకు సరైన ఆధారాలతో వస్తాను అని లక్ష్మీ నరసింహా వివరణ ఇచ్చారు.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
ఆ విషయం నాకు తెలియదు

ఆ విషయం నాకు తెలియదు

ఇక కేసుపై అనేక రకాల రూమర్స్ కూడా వైరల్ అవుతుండడంతో యాంకర్ శ్యామల కూడా ఇదివరకే వివరణ ఇచ్చారు. భర్తపై కేసు నమోదవ్వడానికి కారణం ఏమిటనేది తనకు ఏ మాత్రం తెలియదని త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ఆమె ఒక మీడియా ఛానెల్ కు వివరణ ఇచ్చింది. ఇక ఇప్పుడు లక్ష్మీ నరసింహా పూర్తి ఆధారాలతో మరోసారి మీడియా ముందుకు వస్తానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X