twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ యాంకర్ శ్యామల అందంతో ఆకట్టుకుంటోంది!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్లు, పలు టీవీ కార్యక్రమాల్లో యాంకర్ల ప్రాముఖ్యత పెరిగి పోయింది. తెలుగు తెరపై యాంకర్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఝాన్సీ, సుమ, అనసూయ లాంటి వారు ఉన్నారు. తాజాగా మరో యాంకర్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

    కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, హీరోయిన్‌కు ఏ మాత్రం తీసి పోని అందం, నిర్మాలమైన ముఖారవిందం ఆమె సొంతం. ఆమె మరెవరో కాదు టీవీ యాంకర్ శ్యామల. టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల ఆ తర్వాత కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

    Anchor Syamala looking beautiful

    ఈ క్రమంలో పలు టాలీవుడ్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు యాంకర్ చేస్తూ అందరి దృష్టిలో పడింది. దీంతో పలువురు దర్శకులు ఆమెలోని యాక్టింగ్ స్కిల్స్, అందం చూసి తమ సినిమాల్లో అవకాశాలు కూడా ఇచ్చారు. ఇటీవల విడుదలై గోపీచంద్ ‘లౌక్యం', నాగ చైతన్య ‘ఒక లైలా కోసం' చిత్రంల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది.

    కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా తెరరెక్కిన ‘పటాస్' ఆడియో ఫంక్షన్లో శ్యామల తన నిర్మలమైన సౌదర్యంతో ఆకట్టుకుంది. ఈ ఆడియో వేడుకలో మరో యాంకర్ ఝాన్సీ ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ అందరి చూపులు యాంకర్ శ్యామల వైపే ఉండటం గమనార్హం.

    English summary
    Anchor Syamala looking beautiful at Shankar's 'I' audio launch.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X