యాంకర్ శ్యామల షాకింగ్ డెసీషన్: జగనన్నకు దూరం.. ఆ మీటింగ్ వెనుక అసలు కారణం ఇదేనా!
సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సినిమా యాక్టర్‌గా మారి.. ఇప్పుడు యాంకర్‌గా స్థిరపడిపోయింది శ్యామల. ఎప్పుడో పరిచయమైన ఈమె.. సుదీర్ఘ కాలంలో ఎన్నో విధాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఫుల్ ఫేమ్ అయిన ఈ భామ.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో రాజకీయాల్లోనూ మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ డెసీషన్ తీసుకుందట శ్యామల. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. సినిమాల్లోనూ సత్తా
చాలా కాలం క్రితమే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్యామల.. 'లయ', 'అభిషేకం' వంటి సీరియల్స్‌తో బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత యాంకర్‌గా మారిపోయి కొన్ని షోలు చేసింది. ఇందులో 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' కార్యక్రమాలతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వీటితో పాటు 'లౌక్యం', 'ఒక లైలా కోసం', 'గుండెల్లో గోదారి' సహా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

టీవీ నటుడితో ప్రేమాయణం.. వివాహం
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో బుల్లితెర నటుడు నరసింహాతో ప్రేమలో పడింది శ్యామల. ఆ తర్వాత వీళ్లిద్దరూ చాలా కాలం పాటు సీక్రెట్‌గా ట్రాక్ నడిపారు. ఈ క్రమంలోనే తమ బంధం గురించి ఇద్దరి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీనికి వాళ్లు పచ్చజెండా ఊపడంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఇప్పుడు ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

బిగ్ బాస్ ఎంట్రీ... రీఎంట్రీ... నిరాశతోనే
సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రకాలుగా తెలుగు ప్రేక్షకులకు కనిపించిన శ్యామల.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ షో నుంచి మధ్యలో ఎలిమినేట్ అయినప్పటికీ, మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో తెలుగు ప్రేక్షకులు ఆమెకు బాగానే ఓట్లు వేశారు. అయితే, చివరి వరకూ ఉండలేకపోయింది. కానీ, ఈ షో వల్ల ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుందీ భామ.

రాజకీయాల్లోకి ప్రవేశం.. జగన్ కోసమే
బిగ్ బాస్ తర్వాత వచ్చిన క్రేజ్‌తో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సాగిపోతోంది యాంకర్ శ్యామల. ఈ క్రమంలోనే 2019 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు భర్తతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎన్నికల సమయంలో వీళ్లిద్దరూ కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అలాగే, సోషల్ మీడియాలోనూ జగన్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు.

శ్యామల షాకింగ్‌గా... జగన్‌కు దూరం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చీపై కూర్చున్నారు. దీంతో శ్యామలకు ఏదైన పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమెకు అలాంటి అవకాశం రాలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఆయనతో సమావేశం.. అలా పోస్టింగ్
యాంకర్ శ్యామల తాజాగా తన భర్త నరసింహాతో కలిసి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బావ.. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌తో సమావేశం అయింది. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ యాంకర్.. 'స్నేహపూర్వక భేటీ.. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ అనిల్ కుమార్ అన్న' అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వైరల్ అయింది.

ఆ మీటింగ్ వెనుక అసలు కారణం ఇదే
రెండు రోజుల క్రితం వైఎస్ షర్మిల తెలంగాణలో ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అది జరిగిన రోజు శ్యామల బ్రదర్ అనిల్ కుమార్‌ను కలిశారు. దీంతో ఆమె జగన్‌మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి షర్మిల పార్టీలో చేరబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆయనతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











