Bangalore Rave Party బెంగళూరు రేవ్ పార్టీపై యాంకర్ శ్యామల.. అసత్య ప్రచారం చేస్తే ఊరుకోం అంటూ వార్నింగ్

బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త వాసు జన్మదిన వేడుకల సంధర్బంగా జరిగిన రేవ్ పార్టీని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ విభాగం భగ్నం చేయడం సంచలనం రేపింది. ఈ పార్టీలో పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఉన్నారనే విషయం మరింత సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ డ్రగ్స్ పార్టీలో నటి హేమ, శ్యామల ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై శ్యామల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారంటే..

బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీపై బెంగళూరు పోలీసులు మెరుపు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనలో 17 గ్రాముల ఎండిఎంఏ, కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని వారిని వైద్య పరీక్షలకు పంపారు. ఈ వ్యవహారంలో శ్యామల ఉందనే ప్రచారాన్ని యాంకర్ ఖండించింది.

Anchor Syamala Reacted on Bangalore Rave Party incident in Hyderabad

బెంగళూరు రేవ్ పార్టీ.. ఆ పార్టీ ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగిందనే విషయం నాకు తెలియదు. అక్కడ ఎవరెవరూ ఉన్నారో తెలియదు. కానీ నేను ఆ పార్టీలో ఉన్నానని ఓ ఛానెల్ దుష్ప్రచారం చేస్తున్నది. అసత్య ప్రచారాలు నాపై చేయడం చాలా దారుణం అని యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుసంధానమైన ఉన్నందుకు వారు నాపై కక్షపూర్తితంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ మీద, మా మీద అసత్య ప్రచారం చేస్తే ఊరుకొనేది లేదు. మా మీద అసత్య ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపోరాటం చేస్తున్నాం. వారిపై పరువు నష్టం దావా కేసు వేశాం అని యాంకర్ శ్యామల వెల్లడించింది.

Anchor Syamala Reacted on Bangalore Rave Party incident in Hyderabad

జర్నలిస్టులు వాస్తవాలు రాయాలి. అసలు విషయం తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదు. ఇలాంటి ప్రచారాన్ని అసలు ఊరుకొనేది. జర్నలిస్టు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసి జర్నలిజం విలువల్ని దిగజార్చవద్దు అని శ్యామల హితవు చెప్పారు.

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసింది. పిఠాపురంలో ప్రచారం చేసి పవన్ కల్యాణ్‌పై, ఆయన పార్టీపై, ఆయన తరఫును ప్రచారం చేస్తున్న వారిపై సెటైర్లు వేసింది. ఈ క్రమంలో తనను టార్గెట్ చేశారని యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X