For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షూటింగ్ జరుగుతుండగా కొట్టింది.. హరితేజ ఫోన్ చేయడం వల్లే అలా: సీక్రెట్ మేటర్ లీక్ చేసిన శ్యామల

  |

  శ్యామల.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా దాదాపు పదేళ్లుగా ఆమె బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా సందడి చేస్తోంది. అదే సమయంలో సినిమా ఫంక్షన్లనూ హోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇవి మాత్రమే కాదు.. బిగ్ బాస్ షో కూడా ఈ యాంకరమ్మకు మంచి పేరునే తెచ్చింది. అలాగే, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. వీటన్నింటి వల్లే ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఓ పర్సనల్ సీక్రెట్‌ను లీక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  నటిగా పరిచయం.. యాంకర్‌గా పేరొచ్చింది

  నటిగా పరిచయం.. యాంకర్‌గా పేరొచ్చింది

  చిన్న వయసులోనే బుల్లితెరపై హీరోయిన్‌గా అడుగు పెట్టింది శ్యామల. ఇలా కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సీరియళ్లలో నటించింది. అందులో 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటివి ఆమెకు గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలతో ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 'లౌక్యం', 'ఒక లైలా కోసం' సహా పలు సినిమాల్లో కూడా నటించింది.

  ఆ నటుడితో ప్రేమాయణం.. అలా వివాహం

  ఆ నటుడితో ప్రేమాయణం.. అలా వివాహం

  కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే యాంకర్ శ్యామల.. బుల్లితెరపై సత్తా చాటుతోన్న నటుడు నరసింహాతో ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే.

   తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారి

  తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారి

  వరుసగా సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న శ్యామల.. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలతోనూ సమావేశం అయింది. తద్వారా రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

  ఇంటర్వ్యూతో కలకలం రేపుతోన్న యాంకర్

  ఇంటర్వ్యూతో కలకలం రేపుతోన్న యాంకర్

  శ్యామల తాజాగా ఓ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను గురించి అందులో వెల్లడించింది. కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలు.. పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన ఒడిదుడుకులను క్షుణ్ణంగా వెల్లడించింది. అదే సమయంలో పలువురిపై సంచలన ఆరోపణలు సైతం చేసింది. దీంతో ఆమె ఇంటర్వ్యూ చాలా మందిలో వణుకును పుట్టింది.

  టీనేజ్‌లోనే లవ్ స్టోరీ.. నేను మాట్లాడడంతో

  టీనేజ్‌లోనే లవ్ స్టోరీ.. నేను మాట్లాడడంతో

  తాజా ఇంటర్వ్యూలో శ్యామల తన ప్రేమకథ గురించి చెబుతూ.. 'నరసింహాను ఫస్ట్ టైమ్ చూడగానే ఏదో స్పెషల్ అనిపించాడు. అయితే అతడు నన్ను పట్టించుకునేవాడు కాదు. అప్పుడు నేనే వెళ్లి మాట్లాడడం మొదలెట్టా. తర్వాత తను కూడా క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత నన్ను తనే స్వయంగా డ్రాప్ చేసేవాడు. అలా మా మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు నాకు 17 ఏళ్లే' అని చెప్పింది.

  షూటింగ్ జరుగుతుండగా నన్ను కొట్టింది

  షూటింగ్ జరుగుతుండగా నన్ను కొట్టింది

  దీనిని కొనసాగిస్తూ.. 'మా విషయం అమ్మతో చెప్పాను. ఆ తర్వాత అతడితో మాట్లాడతానని ఇంటికి రమ్మంది. అప్పుడు మా వాళ్లందరినీ పిలిచింది. ఆ సమయంలో నరసింహా పేరెంట్స్ యూఎస్‌లో ఉన్నారు. వాళ్లు మాట్లాడితేనే పెళ్లి చేస్తామని మా వాళ్లు అన్నారు. కానీ, అలా కుదరలేదు. దీంతో పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను అతడితో మాట్లాడుతుండగా షూటింగ్‌ స్పాట్‌లోనే మా అమ్మ నన్ను కొట్టింది' అని చెప్పుకొచ్చిందామె.

  Recommended Video

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  హరితేజ ఫోన్ చేయడం వల్లే అలా జరిగింది

  హరితేజ ఫోన్ చేయడం వల్లే అలా జరిగింది

  'ఆ గొడవ తర్వాత అమ్మ నన్న వదిలేసి వెళ్లిపోయింది. అప్పుడు హరితేజ (నటి, బిగ్ బాస్ ఫేం) ఫోన్‌తో నరసింహాకు కాల్ చేశా. అప్పుడతను నన్ను వాళ్ల అక్క ఇంట్లో పెట్టాడు. అలా నేను మేజర్ అయ్యే వరకూ చూసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. దీంతో మా అమ్మకు నమ్మకం కలిగింది. ఇప్పుడంతా సెట్ అయింది' అంటూ పర్సనల్ సీక్రెట్‌ను రివీల్ చేసింది శ్యామల.

  English summary
  Syamala is an anchor, model and TV-film actress. She was born on 5 November 1989 in Kakinada, East Godavari, Andhra Pradesh. She is also called by the name ‘ Shyamala ‘. She did her schooling and graduation from her hometown Kakinada.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X