శ్యామలకు అర్ధరాత్రి వేధింపులు: ఆ కెమెరామెన్‌ బండారం బయట పెడుతూ.. యాంకర్ సంచలన వ్యాఖ్యలు

హోమ్లీ మేకోవర్‌తో పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించడంతో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో బెస్ట్ యాంకర్‌గా వెలుగొందుతోంది సీనియర్ బ్యూటీ శ్యామల. దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తున్న ఈమె.. వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. తద్వారా కెరీర్‌ను సాఫీగా నడుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలు బయట పెట్టింది. ఇందులో భాగంగానే ఓ కెమెరామెన్ బండారాన్ని బయట పెట్టేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలకై మొత్తం చదవండి!

గ్లామర్‌తో అదరగొట్టిన రత్తాలు.. ఈ సమయంలో అక్కడ రాయ్ లక్ష్మి జిగేల్

నటిగా పరిచయం.. యాంకర్‌గా పాపులర్

నటిగా పరిచయం.. యాంకర్‌గా పాపులర్

సీరియల్ నటిగా తెలుగు వాళ్లకు పరిచయం అయింది శ్యామల. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' సహా పలు ధారావాహికల్లో నటించడం ద్వారా ఆమె ఫేమస్ అయింది. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలతో పాపులర్ అయింది. ఆ తర్వాత 'లౌక్యం', 'ఒక లైలా కోసం', 'గుండెల్లో గోదారి' సహా కొన్ని చిత్రాల్లో కూడా నటించింది.

ఆ నటుడితో ప్రేమాయణం.. తర్వాత పెళ్లి

ఆ నటుడితో ప్రేమాయణం.. తర్వాత పెళ్లి

వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తున్న సమయంలోనే యాంకర్ శ్యామల.. బుల్లితెరపై సత్తా చాటుతోన్న నటుడు నరసింహాతో లవ్‌లో పడిపోయింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే.

రాజకీయాల్లోకి.. అప్పుడలా.. ఇప్పుడిలా

రాజకీయాల్లోకి.. అప్పుడలా.. ఇప్పుడిలా

బుల్లితెరపై, వెండితెరపై సత్తా సందడి చేస్తూ వరుస ఆఫర్లు దక్కించుకుంటోన్న శ్యామల.. 2019లో ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అప్పుడు జగన్‌మోహన్ రెడ్డి విజయం కోసం భర్తతో కలిసి శ్రమించింది. ఇక, ఇప్పుడేమో తెలంగాణ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిలతో పలుమార్లు సమావేశం అయింది. దీంతో రెండు రాష్ట్రాల రాజకీయాల్లో భాగం అవుతూ హడావిడి చేస్తోంది.

శ్యామల జీవితంలో భయానక సంఘటన

శ్యామల జీవితంలో భయానక సంఘటన

తాజాగా యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంది. అలాగే, ఫ్యామిలీ లైఫ్‌లోని మధురానుభూతులను కూడా ప్రేక్షకులకు వివరించింది. అలాగే, తన ప్రేమ ఎలా పుట్టింది? పెళ్లి ఎలా జరిగింది? అనే విషయాను వెల్లడించిందామె. అదే సమయంలో లైఫ్‌లో జరిగిన ఓ భయానక సంఘటనను బయటపెట్టింది.

సీరియళ్లు మానేసి వెళ్లిపోదాం అనుకున్నా

సీరియళ్లు మానేసి వెళ్లిపోదాం అనుకున్నా


కెరీర్‌లో ఎదురైన అనుభవాలను గురించి వివరిస్తూ.. 'నేను అమ్మతో కలిసి హైదరాబాద్‌లో అడుగు పెట్టా. సీరియళ్లలో నటించడం మొదలెట్టినప్పుడు చాలా ఇబ్బందులు కలిగాయి. కావాలనే చాలా మంది నన్ను పదే పదే విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్‌తో ఇబ్బంది పెట్టేవారు. దీంతో మూడు సీరియళ్లు చేసేసి.. తిరిగి ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నా' అంటూ వెల్లడించింది యాంకర్ శ్యామల.

యాంకర్ శ్యామలకు అర్ధరాత్రి వేధింపులు

యాంకర్ శ్యామలకు అర్ధరాత్రి వేధింపులు


తనకు కెరీర్ ఆరంభంలో వేధింపులు కూడా వచ్చాయని చెబుతూ.. 'ఓ కెమెరామెన్ బాగా వేధించాడు. అర్ధరాత్రి సమయంలోనూ ఫోన్ చేసి భయపెట్టేవాడు. ఒకసారి అమ్మ లిఫ్ట్ చేస్తే.. మీకు మగదిక్కు లేదు. నేను తలచుకుంటే ఏమైనా చేయగలను. నేను వెళ్లి మాట్లాడుతుంటే మీ అమ్మాయి పట్టించుకోవడం లేదు.. మీరైనా చెప్పండి అని బెదిరించేవాడు' అంటూ చెప్పింది శ్యామల.

ఆ కెమెరామెన్‌ బండారం బయట పెడుతూ

ఆ కెమెరామెన్‌ బండారం బయట పెడుతూ


సదరు కెమెరామెన్‌ గురించి కంప్లైంట్ చేశానని శ్యామల వెల్లడించింది. 'ఆయన బెదిరించే సరికి అమ్మ బాగా బెదిరిపోయింది. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడే అమ్మ వెళ్లి ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యుసర్‌కి చెప్పింది. అప్పుడాయన మేనేజర్‌ని పిలిపించి మాట్లాడారు. కాకపోతే వాళ్లంతా ఫ్రెండ్స్ కావడంతో ఆయననూ ఏమీ చేయలేదు. కానీ అతడి గురించి అందరికీ తెలిసింది' అని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X