‘ఆ షో నుంచి అలా తీసేశారు... అమ్మాయిల్నే కాదు మగాళ్లనీ వదలరు’

యాంకరింగ్‌కు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన వారిలో ఉదయభాను ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న సుమ కనకాల కంటే ముందే ఇండస్ట్రీలో ఆమె టాప్ యాంకర్‌గా ప్రభంజనం సృష్టించారు. అసలు తెలుగునాట యాంకర్ అంటే ఉదయభాను అన్నంతగా ఆమె తన ముద్ర వేశారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి టాప్ సెలబ్రిటీగా మారారు ఉదయభాను. ఆమెను చూసే చాలామంది యాంకరింగ్ వైపు అడుగులు వేశారంటే అతిశయోక్తి కాదు. అలా టాప్ పొజిషన్‌లో ఉన్న ఉదయభాను.. అనూహ్యంగా కనిపించకుండా పోయారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తన కష్టాలు, పోరాటంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉదయభాను. ఈ వివరాల్లోకి వెళితే..

ఇటీవలి కాలంలో చేసిన పోలీస్ ఆఫీసర్ రోల్‌కి చాలా మంచి పేరొచ్చింది. ఇప్పటికీ ఆ సిరీస్ నెంబర్‌వన్‌గా రన్ అవుతోంది. అప్పుడు యాంకరింగ్ ఆర్గానిక్‌గా ఉండేది. 90 శాతం రైటర్స్ ఉండేవారు కాదు.. ఓన్‌గా, తమకు తాము సొంతంగా ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు ప్రతిదీ స్క్రిప్టేడ్.. ప్రతి డైలాగ్, పంచ్, జడ్జిల అభిప్రాయాలు, వచ్చిన గెస్ట్ ఏంటారో అంతా ప్లాన్డ్‌గా జరుగుతుండటంతో ఆ ఆర్గానిక్ ఫ్లేవర్ పోయింది. ఏ షో చూసినా ఒకే కాన్సప్ట్ కనిపిస్తుంది. పంచ్‌లు ఉంటాయి.. ఒకరిని టార్గెట్ చేస్తారు, ముఖ్యంగా యాంకర్‌ని టార్గెట్ చేసి చిన్న చూపు చేసి మాట్లాడతారు. ఆ పెయిన్ తీసుకుని యాంకర్లు నవ్వాల్సిందే. అప్పట్లో అలా కాదు.. ఎమోషన్ ఉండేది, నవ్వుకునేవాళ్లం. ఇప్పటికీ నేను చేసే షోలకు ఒక పద్ధతి ఉంటుంది.. అలా అయితేనే నేను యాక్సెప్ట్ చేస్తానని ఉదయభాను గుర్తుచేసుకున్నారు.

Anchor Udaya Bhanu Emotional Comments on TV Industry Struggles and Dhee Show Exit

ఇప్పుడు.. జబర్దస్త్, ఢీ ఒకటే చెబితే చాలామందికి కోపం రావొచ్చు. 10 మంది కలిసి కామెడీ చేయడం, దానిలో నవ్వుకోవడమే. ఒకప్పుడు ప్రతి మాస్టర్‌కు ఢీ లైఫ్ ఇచ్చింది. శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్ వంటి వాళ్లకి సిగ్నేచర్. అప్పట్లో మేం ఢీ చేసేటప్పుడు కేవలం తమిళ మాస్టర్లు, వేరే రాష్ట్రాల మాస్టర్లు చాలా పాపులర్. మన తెలుగు వాళ్లు అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు తెలుగు మాస్టర్స్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. బిగినింగ్‌లో వాళ్లు ఇక్కడ స్ట్రగుల్ అయ్యారు, ఎన్నో మాటలు పడ్డారు. అప్పుడు వాళ్లని అంత హైలైట్ చేసేవాళ్లం.. మాస్టర్స్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవాళ్లని ఉదయభాను తెలిపారు.

ఈ డ్యాన్స్ కార్యక్రమానికి ఎందుకు యాంకర్‌గా కంటిన్యూ చేయలేదని హోస్ట్ ప్రశ్నించగా.. నన్ను షోలో నుంచి తీసేసినట్లు ఇప్పటికీ కూడా ఛానెల్, ప్రొడక్షన్ వాళ్లు ఫోన్ చేసి చెప్పలేదు. అప్పట్లో ఫ్లోర్‌లో ఏసీలు ఉండేవి కావు.. పెద్ద పెద్ద లైట్లు ఉండేవి. కుండతో నీళ్లు పోసినట్లుగా తడిచిపోయేదానిని. ఉదయాన్నే అందరికంటే ముందే యాంకర్‌ని తీసుకెళ్లేవాళ్లు. 4 గంటలకు షూటింగ్ ప్యాకప్ అయ్యేది... మళ్లీ 6 గంటలకి షూటింగ్ మొదలయ్యేది. అయినా వెళ్లాలి, నిలబడాలి... అప్పటి నుంచి మొదలుపెడితే మళ్లీ సూర్యుడు వచ్చే వరకు కష్టపడేవాళ్లం. నిలబడి నిలబడి కాళ్లకి బొబ్బలు వచ్చేవి. అంత కష్టపడినా నా మీద ఇంత కృతజ్ఞత కూడా లేదని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు.

నాకు ఎంతోమంది అన్యాయం చేశారు.. కానీ దీనిని మాత్రం మరిచిపోలేను. చిన్న పల్లెటూరి నుంచి ఇండస్ట్రీకి వచ్చా. నేనేం పెద్ద ప్రొడ్యూసర్ కొడుకునో, కూతురినో కాదు. మా నాన్న చిన్న గ్రామానికి సర్పంచ్.. కానీ అన్నీ తట్టుకుని ఇండస్ట్రీలో ఉన్నా. నా కథ ఖచ్చితంగా 100 మందికి ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుందని నమ్ముతున్నా. పల్లెటూరి నుంచి వచ్చే బిడ్డలు ఎన్నో కలలతో వస్తున్నారు. అప్పట్లో ఏం చేయాలంటే అది చేసేదానిని. డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేశా.. సాహసం చేయరా ఢింబక షోలో ఫస్ట్ బంగీ జంప్ చేశా. అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరూ ఏం చేయలేరు. అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే ఎవ్వరూ ఏం పీకలేరు. కానీ అమ్మాయిలకు టఫ్‌గానే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పిశాచాలు, భూతాలు ఉన్నాయి. ఆడపిల్లలకే కాదు మగాళ్లకి కూడా సేఫ్టీ లేదు. కానీ చుట్టూ పరిస్ధితుల్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఉదయభాను యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read more about: udaya bhanu movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X