Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌కు షాకిచ్చిన ఒకప్పటి స్టార్ యాంకర్.. ఇలా చేసిన ఏకైక సెలెబ్రిటీ ఈమేనట
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుని.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబట్టి నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ కార్యక్రమం ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ స్టార్ యాంకర్ బిగ్ బాస్‌కు షాకిచ్చినట్లు న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన వివరాలు మీకోసమే!

ఏడో సీజన్‌కు ముహూర్తం: మిగిలిన భాషల కంటే తెలుగులో బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. అందుకే నిర్వహకులు ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దానిని కూడా ప్రారంభించబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సీజన్‌ను ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టబోతున్నారని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
ఉల్టాపల్టా అంటూ కొత్తగా: బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుంది. కానీ, ఆరో సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. పైగా దీనిపై ఎన్నో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఏడో సీజన్‌ను సరికొత్తగా ప్లాన్ చేశారు. ఇందులో అంతా ఉల్టాపల్టాగా ఉంటుందని తాజాగా వచ్చిన ప్రోమోల్లో హోస్ట్ నాగార్జున వెల్లడించాడు.
తుది దశకు చేరిన వర్క్: బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించేశారు. ముఖ్యంగా ఈ సీజన్‌ను నడిపించే హౌస్, స్టేజ్‌లను ఎంతో కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారు. వీటికి సంబంధించిన పనులను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసినట్లు తెలిసింది. వీటితో పాటు షో నడిపించే తీరుపై ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు బుల్లితెర వర్గాల సమాచారం.
కంటెస్టెంట్ల లిస్ట్ కూడా: వచ్చే సెప్టెంబర్ నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం నిర్వహకులు కంటెస్టెంట్ల ఎంపిక గురించి కాస్త ఎక్కువగానే ఫోకస్ చేశారు. ముఖ్యంగా జనాదరణ ఉన్న సెలెబ్రిటీలనే తీసుకు రావాలని భావించారు. ఇలా చాలా మందిని నిర్వహకులు ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే వాళ్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి.

ఉదయ భాను ఎంట్రీ: గత సీజన్ నిరాశ పరచడంతో ఈ సారి ఏడో దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని నిర్వహకులు పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం పేరున్న సెలెబ్రిటీలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయ భానుతో చర్చలు జరిపినట్లు ఓ న్యూస్ ఇటీవలే బయటకు వచ్చింది. అంతేకాదు, ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో ఓకే చెప్పిందని అన్నారు.

షాకిచ్చిన యాంకరమ్మ: మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల లిస్టును కూడా దాదాపుగా ఫైనల్ చేసేశారు. ఈ నేపథ్యంలోనే ఏడో సీజన్‌లో పాల్గొనాల్సిన స్టార్ యాంకర్ ఉదయ భాను దీని నుంచి తప్పుకున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

ఏకైక సెలెబ్రిటీ ఈమే: వాస్తవానికి ఉదయ భానును బిగ్ బాస్ టీమ్ గత రెండు సీజన్లలోనే తీసుకు రావాలని అనుకున్నారు. కానీ, అప్పుడు ఆమె పిల్లలు చిన్నవాళ్లు కావడం వల్లే రిజెక్ట్ చేసింది. తీరా ఇప్పుడు కూడా నిర్వహకులు ఏడో సీజన్ కోసం సంప్రదించగా.. ఉదయ భాను తిరస్కరించినట్లు తెలిసింది. ఇలా ఏకంగా మూడు సార్లు బిగ్ బాస్ రిజెక్ట్ చేసిన ఏకైక సెలెబ్రిటీ ఈమేనని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











