బాలకృష్ణ దేవుడు..అప్పుడు సింహంలా వచ్చాడు.. రేణుదేశాయ్‌తో చెప్పి ఏడ్చిన ఉదయభాను
Recommended Video

టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్లలో ఒకరు అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. తాను పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎవరూ ఆదరించకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. కుటుంబంలో జరిగే వేడుకలకు దూరమయ్యారు. ఆ సంగతులను తలచుకొని ఇటీవల ఓ కార్యక్రమంలో సినీ నటి రేణుదేశాయ్ ముందు ఉదయభాను కంటతడి పెట్టుకోవడం మీడియాను ఆకర్షించింది. ఇంతకీ ఏమి జరిగిందంటే..

ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కోరికలు వస్తాయి..
నా జీవితంలో వేడుకలు అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలా కోరికలు వస్తాయి. సీమంతం చేయించుకోవాలి అనే కోరికలు పెరుగుతాయి. అవి నెరవేరకపోవడంతో దేవుడు లేడు అని నమ్మాను.

సినీ ప్రముఖులు స్పందించలేదు
అనేక కష్టాల మధ్య నాకు దేవుడు ఇద్దరు పిల్లలను ఇచ్చాడు. సినిమా పరిశ్రమనే నాకు కుటుంబం. నా కుటుంబ మధ్య నా పిల్లల మొదటి బర్త్‌డే జరుపాలని నిర్ణయించుకొన్నాను. అందరికి ఫోన్లు చేశాను. అయితే ఎవరూ స్పందించలేదు. కానీ హీరో బాలకృష్ణకు చిన్న మెసేజ్ పెడితే ఆయన స్పందించారు.

బాలకృష్ణ కాల్ చేసి వస్తాను..
నా మెసేజ్ చూసి వెంటనే కాల్ బ్యాక్ చేసి నా పిల్లల బర్త్ డేకు వస్తాను అని బాలకృష్ణ చెప్పారు. బర్త్ డే సెలబ్రేషన్ సమయం, వివరాలు తెలుసుకొన్నారు. అంతకుముందు రోజు అనంతపురంలో కార్యక్రమం ఉంది. అది పూర్తి చేసుకొని రాత్రికి హైదరాబాద్ చేరుకొంటాను. నీ బిడ్డల ఫంక్షన్ తప్పకుండా వస్తాను. అలాగే సమయానికి సింహంలా బాలకృష్ణ నడిచి వచ్చారు అని ఉదయభాను గుర్తు చేసుకొన్నారు.

బాలకృష్ణలో దేవుడు కనిపించాడు
అప్పుడు బాలకృష్ణలో నాకు దేవుడు కనిపించాడు. అందరు సినీ ప్రముఖుల మాదిరిగా వచ్చి 10 నిమిషాలు ఉండిపోలేదు. 45 నిమిషాలు కార్యక్రమంలో ఉన్నారు. అందరితో ఫొటోలు దిగారు. హ్యాట్సాఫ్ హ్యాట్సాఫ్ బాలయ్య అంటూ ఉదయభాను ఆనందంలో మునిగి తేలింది ఉదయభాను.

జై బాలయ్య అంటూ ఉద్వేగం
బాలకృష్ణ లాంటి వ్యక్తులు సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తారు. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. జై బాలయ్య అంటూ ఉదయభాను ఉద్వేగానికి గురయ్యారు.

రవి కిరణ్, సుష్మాలకు మ్యారేజ్
తన మాదిరిగా పెద్దలు లేకుండా పెళ్లి చేసుకొని ఎవరూ బాధపడకూడదు అని ఉదయభాను అన్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి జరుగని టీవీ నటులు రవికిరణ్, సుష్మాలకు నీతోనే డాన్స్ కాంపిటీషన్ వేడుకపై వారికి పెళ్లి చేశారు. పెళ్లికి హాజరుకాని రవికిరణ్, సుష్మ తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించారు.

రేణుదేశాయ్ ముందట మ్యారేజ్
రేణుదేశాయ్ నేతృత్వంలో జరిగిన రవికిరణ్, సుష్మ పెళ్లికి హీరో ఆదర్శ్ దంపతులు, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుక చాలా సంతోష క్షణాల మధ్య జరిగింది. దాంతో మరోసారి కుటుంబ సభ్యుల మధ్యలో రవికిరణ్, సుష్మ దంపతులు మరోసారి ఒక్కటయ్యారు.


Click it and Unblock the Notifications











