Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అదిరిపోయే గ్లామర్ ట్రీట్.. కుర్రకారుకి హుషారు పుట్టిస్తున్న యాంకర్

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్, నటి వర్ష (Varsha). టిక్‌టాక్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన వర్ష, తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తరువాత బుల్లితెరలో అత్యంత పాపులర్ కామెడీ షో అయిన జబర్దస్త్ (Jabardasth) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో చిన్న పాత్రలతో కనిపించినా, తన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ యాంకరమ్మ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన గ్లామర్ ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు జబర్దస్త్ అంటే గ్లామర్ కోణంలో అనసూయ, రష్మీ గౌతమ్ పేర్లు వినిపించేవి. అయితే వర్ష ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ట్రెండ్ కొంత మారింది. తన అందం, స్టైలిష్ లుక్స్‌తో పాటు కామెడీ స్కిట్లలోనూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది. ముఖ్యంగా బిగ్‌బాస్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్‌తో కలిసి చేసిన స్కిట్స్ వర్షకు మరింత క్రేజ్ తీసుకువచ్చాయి. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్‌లు, ఫన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని షోలో హైలైట్‌గా నిలిచాయి. ఇదే ఆమెకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ పెరగడానికి కారణమైంది.

Anchor Varsha Viral Glam Photos Jabardasth Beauty Stuns in Blue Saree Look

ఇక బుల్లితెరపై మాత్రమే కాకుండా వర్ష ప్రస్తుతం పలు షోల్లో యాంకర్‌గా కూడా రాణిస్తోంది. ముఖ్యంగా 'కిస్సిక్ టాక్' అనే టాక్ షోను సక్సెస్ పుల్ గా రన్ చేస్తుంది. ఇప్పటివరకూ 50 పైగా ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ షోలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ తన హోస్టింగ్ టాలెంట్‌ను కూడా నిరూపిస్తోంది. అయితే వర్ష ప్రయాణం అంత సులభం కాదు. తన వాయిస్, లుక్స్‌పై వచ్చిన ట్రోల్స్‌ను కూడా ఆమె ఎదుర్కొంది. కొన్ని సందర్భాల్లో బాధపడినప్పటికీ, తన టాలెంట్‌తోనే విమర్శలకు సమాధానం చెప్పింది. అదే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది.

బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెనల్ లైఫ్ గురించి తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. వారితో లైవ్ స్ట్రీమింగ్, చాటింగ్ చేస్తుంటుంది. ప్రస్తుతం వర్షకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే.. ఆ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ బుల్లి తెర యాంకర్మ తరచూ గ్లామర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా నీలం రంగు చీరలో దిగిన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ షేర్ చేసిన ఫోటోషూట్‌లో ఆమె నడుము ఒంపుసొంపులను హైలైట్ చేస్తూ కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోల కింద అభిమానులు ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్, టాలెంట్ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న వర్ష ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మీరు కూడా ఓ లూక్కేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X