For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్‌లోకి వెళ్లేముందు అభిజిత్ కాల్ చేశాడు.. టాప్ 2లో ఉండేది వారే.. వర్షిణి కామెంట్స్ వైరల్

    |

    యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే వర్షిణి బిగ్ బాస్ షోకు పెద్ద ఫ్యాన్ అంటా. ప్రతీ రోజూ క్రమం తప్పుకుండా చూస్తుందట. తాజాగా దీపావళి సందర్భంగా యాంకర్ రవి వర్షిణిని స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. వర్షిణితో పాటు ఆమె అక్క సౌజన్యను మొదటి సారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో ఆ ముగ్గురు కలిసి బిగ్ బాస్ నాల్గో సీజన్ గురించి ముచ్చటించుకున్నారు.

     అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్..

    అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్..

    వర్షిణి, ఆమె సోదరి సౌజన్యలకు అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్. పైగా వర్షిణి అభిజిత్ కాంబోలో పెళ్లి చూపులు అనే ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్ వచ్చింది. మూడు సీజన్లు ఫుల్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అలా ఏర్పడిన స్నేహంతో బిగ్ బాస్‌లో అభిజిత్ గురించి వర్షిణికి అన్నీ తెలిసి ఉంటాయి.. బిగ్ బాస్ షోలోకి వెళ్లే ముందు అభిజిత్ ఫోన్ చేశాడట.

    అలా చెప్పిందట..

    అలా చెప్పిందట..

    అభిజిత్ బిగ్ బాస్‌కు వెళ్లే ముందు నాకు కాల్ చేశాడు. ఇలా షో వాళ్లు రమ్మంటున్నారు వెళ్లాలా? వద్దా? ఎలా ఉంటుందని అని అడిగాడు. టీవీ ఇండస్ట్రీ గురించి నీకు తెలుసు కదా ఎలా ఉంటుంది? ఏ నిర్ణయం తీసుకోవాలి అని అడిగాడు. నువ్ చాలా స్మార్ట్.. బాగా ఆలోచిస్తావ్.. వెళ్తే బాగుంటుందని చెప్పాను అని వర్షిణి అసలు విషయం చెప్పింది.

    ఆ ఇద్దరూ టాప్ 2..

    ఆ ఇద్దరూ టాప్ 2..

    బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో తనకు అభిజిత్ అరియానా అంటే ఇష్టమని వర్షిణి చెప్పింది. నాక్కూడా ఆ ఇద్దరే ఇష్టమని వర్షిని సోదరి చెప్పింది. అయితే ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. కానీ నాకు అభిజిత్ ఫ్రెండ్ కాబట్టి.. అతనే గెలవాలని ఉందంటూ వర్షిణి చెప్పుకొచ్చింది.

    అరియానా గెలవాలి..

    అరియానా గెలవాలి..

    అయితే వర్షిణి సోదరి మాత్రం అరియానా గెలవాలని అనుకుంటున్నట్టు చెప్పింది. ఇంత వరకు లేడీ కంటెస్టెంట్లు గెలవలేదు.. అరియానా టైటిల్ గెలిస్తే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే బయట ట్రెండ్ మాత్రం అలా లేదనిపిస్తోంది. టాప్ 2లో అభిజిత్ సోహెల్ ఉంటారని టాక్ నడుస్తోంది. అరియానా అయితే టాప్ 5లో ఉంటుందని అందరూ ఏకాభిప్రాయంతో చెబుతున్నారు.

    English summary
    Bigg Boss 4 telugu Anchor Varshini About Abhijeet And Ariyana, abhijeet and Sohail In Top 2 Positions, Mehaboob about Abhijeet, Bigg Boss 4 telugu week 11 Captaincy Task Goes Viral, Bigg Boss 4 telugu week 11 Abhijit Mother Reaction Disputes With Contestants, Bigg Boss 4 Telugu week 11 Avinash Fun With Ariyana, Akhil About Harika With Sohel, Nagarjuna Gift Mutton To Contestants, Bigg Boss 4 Telugu Week 10 Sohel Cried On Mehaboob Elimination, Mehaboob To Akhil On Elimination, Mehaboob To ABhijeet After Elimination, Sohel Emotional On Mehaboob Elimination, Sohel Comments On Abhijeet, Harika Humiliates Sohel, Sohel Punch To Abhijeet, Bigg Boss 4 Telugu week 10 Diwali Gifts For Housemate, Bigg Boss 4 Telugu week 10 Avinash Is Beaten by Housemate, Bigg Boss 4 Telugu week 10 Ariyana Secret Didn't workout, Bigg Boss 4 Telugu week 10 Akhil Sent to Secret Room, Bigg Boss 4 Telugu week 10 Is Mehaboob Missed captaincy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X