Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బిగ్ బాస్‌లోకి వెళ్లేముందు అభిజిత్ కాల్ చేశాడు.. టాప్ 2లో ఉండేది వారే.. వర్షిణి కామెంట్స్ వైరల్
యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే వర్షిణి బిగ్ బాస్ షోకు పెద్ద ఫ్యాన్ అంటా. ప్రతీ రోజూ క్రమం తప్పుకుండా చూస్తుందట. తాజాగా దీపావళి సందర్భంగా యాంకర్ రవి వర్షిణిని స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. వర్షిణితో పాటు ఆమె అక్క సౌజన్యను మొదటి సారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో ఆ ముగ్గురు కలిసి బిగ్ బాస్ నాల్గో సీజన్ గురించి ముచ్చటించుకున్నారు.
అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్..
వర్షిణి, ఆమె సోదరి సౌజన్యలకు అభిజిత్ ఫేవరేట్ కంటెస్టెంట్. పైగా వర్షిణి అభిజిత్ కాంబోలో పెళ్లి చూపులు అనే ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్ వచ్చింది. మూడు సీజన్లు ఫుల్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అలా ఏర్పడిన స్నేహంతో బిగ్ బాస్‌లో అభిజిత్ గురించి వర్షిణికి అన్నీ తెలిసి ఉంటాయి.. బిగ్ బాస్ షోలోకి వెళ్లే ముందు అభిజిత్ ఫోన్ చేశాడట.
అలా చెప్పిందట..
అభిజిత్ బిగ్ బాస్‌కు వెళ్లే ముందు నాకు కాల్ చేశాడు. ఇలా షో వాళ్లు రమ్మంటున్నారు వెళ్లాలా? వద్దా? ఎలా ఉంటుందని అని అడిగాడు. టీవీ ఇండస్ట్రీ గురించి నీకు తెలుసు కదా ఎలా ఉంటుంది? ఏ నిర్ణయం తీసుకోవాలి అని అడిగాడు. నువ్ చాలా స్మార్ట్.. బాగా ఆలోచిస్తావ్.. వెళ్తే బాగుంటుందని చెప్పాను అని వర్షిణి అసలు విషయం చెప్పింది.
ఆ ఇద్దరూ టాప్ 2..
బిగ్ బాస్ నాల్గో సీజన్లో తనకు అభిజిత్ అరియానా అంటే ఇష్టమని వర్షిణి చెప్పింది. నాక్కూడా ఆ ఇద్దరే ఇష్టమని వర్షిని సోదరి చెప్పింది. అయితే ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. కానీ నాకు అభిజిత్ ఫ్రెండ్ కాబట్టి.. అతనే గెలవాలని ఉందంటూ వర్షిణి చెప్పుకొచ్చింది.
అరియానా గెలవాలి..
అయితే వర్షిణి సోదరి మాత్రం అరియానా గెలవాలని అనుకుంటున్నట్టు చెప్పింది. ఇంత వరకు లేడీ కంటెస్టెంట్లు గెలవలేదు.. అరియానా టైటిల్ గెలిస్తే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే బయట ట్రెండ్ మాత్రం అలా లేదనిపిస్తోంది. టాప్ 2లో అభిజిత్ సోహెల్ ఉంటారని టాక్ నడుస్తోంది. అరియానా అయితే టాప్ 5లో ఉంటుందని అందరూ ఏకాభిప్రాయంతో చెబుతున్నారు.