Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మనిషన్నాక కాస్త సిగ్గుండాలి!!.. వర్షిణి దెబ్బకు నోట మాటరాని హైపర్ ఆది
బుల్లితెరపై హైపర్ ఆది-వర్షిణి చేసిన, చేస్తోన్న రచ్చ గురించి తెలిసిందే. హైపర్ ఆది వర్షిణి పరిచయం, మొదట్లో అయిన గొడవలే వెరైటీగా ఉండేవట. మొదట్లో హైపర్ ఆది-వర్షిణి మధ్య మాటలే ఉండేవి కావని, ఆ తరువాత ఢీ సెట్లోకి వచ్చాక మెల్లిగా స్నేహం మొదలైందని వర్షిణి చెప్పుకొచ్చింది. అలా ఢీ సెట్ మీద మొదలైన స్నేహబంధం యూట్యూబ్‌లో ప్రేమ బంధంగా మారిపోయింది. యూట్యూబ్‌లో ఈ ఇద్దరిపై లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. ఇద్దరికి ప్రేమబంధాన్ని అంటగట్టారు. పెళ్లి పీటలెక్కుతారని కూడా రాసేశారు.
మొదట అలా..
మొదటి తాను సుధీర్ గ్యాంగ్‌లో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది వర్షిణి. ఓ సారి ఆస్ట్రేలియాలోని ఈవెంట్లో సుధీర్ గ్యాంగ్‌తో జాలీగా ఉన్న సమయంలో హైపర్ ఆదిని ఏదో అనేసిందిట. ఆది కూడా కౌంటర్లు వేస్తుండటంతో వర్షిణి కూడా రివర్స్ కౌంటర్లు వేయడం ప్రారంభించిందట. అలా ఏదో ఒక మాట అన్నానని అతని చేతిలో ఉన్న కాఫీ కప్పును విసిరి వెళ్లాడట.
ఢీ సెట్లో అలా..
అయితే ఢీ షోలోకి వచ్చాక మొదట్లో అంతగా మాట్లాడే వాడు కాదని వర్షిణి చెప్పుకొచ్చింది. అయితే బ్రేక్, లంచ్ టైంలో సుధీర్ రష్మీ బాగానే ఉండేవారు.. ఇక మేం ఇద్దరం కొన్ని రోజులు దూరంగానే ఉన్నాం ఆ తరువాత దగ్గరయ్యామని, అలా ఫ్రెండ్స్ అయిపోయామని వర్షిణి చెప్పింది. అలా ఢీ సెట్లో వీరు క్రియేట్ చేసిన కెమిస్ట్రీకి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
హైపర్ ఆదిపై సెటైర్లు..
జబర్దస్త్ షోలో అయితే ఆది అందరి మీద సెటైర్లు వేస్తాడు. కానీ ఢీ షోలో మాత్రం ఆది మీదే అందరూ కౌంటర్లు వేస్తుంటాడు. మరీ ముఖ్యంగా వర్షిణి ఓరేంజ్‌లో ఆడుకుంటుంది. రా అనేస్తుంది.. ఏందిరా అంటుంది.. ఎక్కువ మాట్లాడితే ఆ పొట్ట ఏంటిరా అని కౌంటర్లు వేస్తుంది. తాజాగా అలాంటి ఓ కౌంటరే ఆది మీద పడింది.
Recommended Video
తగ్గు, హగ్గు, సిగ్గు..
హైపర్ ఆది తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో భాగంగా ఓ డైలాగ్ వేశాడు. నేను నీ ముందుకు వచ్చినప్పుడు తగ్గుండాలి.. వచ్చాక ఓ హగ్గుండాలి అని బిల్డప్ ఇస్తూ వర్షిణితో డైలాగ్ కొట్టాడు. అలా స్టైల్‌గా డైలాగ్‌లు కొట్టిన ఆదికి వర్షిణి గట్టి పంచ్ ఇచ్చింది. మనిషన్నాక కాస్త సిగ్గుండాలి అంటూ వర్షిణి వేసిన కౌంటర్‌కు అందరూ పగలబడి నవ్వితే ఆదికి నోటి వెంట మాట రాలేదు.