ప్రాజెక్ట్ కోసం పిలిచాడు.. చేయి పట్టి లాగాడు.. చేదు అనుభవంపై నోరు విప్పిన యాంకర్ వర్షిణి

యాంకర్ వర్షిణి తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు తెలివైన అమ్మాయిలా మాట్లాడుతుంది. ఇంకొన్ని సార్లు చిన్నపిల్లలా చేస్తుంది. బుల్లితెరపై అందరూ కలిసి ఆమెపైనే సెటైర్లు వేస్తూ ఏడిపిస్తుంటారు. ఢీ షోతో వర్షిణి బాగా పాపులర్ అయింది. అంతకు ముందు సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌లో నటించినా కూడా ఢీ షో ఆమెకు బాగా గుర్తింపును తెచ్చింది. తాజాగా ఆమె అలీతో సరదాగా షోలో పాల్గొంది. ఆ షోలో వర్షిణి ఎవ్వరికీ చెప్పని, తెలియని సంఘటనల గురించి మొదటి సారిగా నోరు విప్పింది.

పర్సనల్ లైఫ్ అలా..

పర్సనల్ లైఫ్ అలా..

వర్షిణి తన ఫ్యామిలీ గురించి చెబుతు.. ‘మా నాన్న పుట్టింది, పెరిగింది కూడా ఇక్కడే. అయితే చిన్నప్పుడే మా పేరెంట్స్ విడిపోయారు. నాన్నతో టచ్‌లో లేము. మమ్మల్ని మా అమ్మే పెంచింది. ఈ మధ్యే అక్కకు మ్యారేజ్ అయింది. అన్నయ్య యూఎస్‌లో ఉన్నాడు. జాబ్ చేస్తున్నాడు. అన్నయ్య మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు' అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది.

రాడ్ పెట్టుకుని తిరిగేవాడు..

రాడ్ పెట్టుకుని తిరిగేవాడు..

మా అన్నయ్యకు మా మీద ప్రేమ ఎక్కువ. పొసెసివ్ నెస్ ఎక్కువ. చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లేటప్పుడు మమ్మల్ని ఎవరైనా చూస్తే చాలు కొట్టేసేవాడు. ఎప్పుడూ కూడా రాడ్ వెనకాల పెట్టుకుని తిరిగే వాడు. సినిమాకు వెళ్తే కూడా ఓ సీట్ ఎక్కువగా బుక్ చేసేవాడు. పక్క వారి చేతులు తగులుతాయేమోనని కూడా జాగ్రత్తగా ఎక్స్ ట్రా సీట్ బుక్ చేసేవాడు అంటూ వర్షిణి తన అన్న గురించి చెప్పుకొచ్చింది.

అన్నీ తన దగ్గరకే వచ్చాయి..

అన్నీ తన దగ్గరకే వచ్చాయి..

ఇంత వరకు ఓ ప్రాజెక్ట్ కావాలని నేను ఏ ఆఫీస్‌కు వెళ్లలేదు. నేను చేసిన సినిమాలు కూడా నా దగ్గరకు వచ్చినవే. ఎవ్వరికి కూడా ఫోటోలు పంపలేదు. వెబ్ సిరీస్ అవకాశం కూడా తన దగ్గరికే వచ్చింది. ఢీ ఆఫర్ కూడా నా వద్దకే వచ్చింది. ఇలా నేను ఎప్పుడూ కూడా ఎవరినీ ఏది అడగలేదు అని వర్షిణి చెప్పుకొచ్చింది.

కరోనా కంటే ముందు..

కరోనా కంటే ముందు..

వర్షిణి తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మొదటిసారిగా నోరు విప్పింది. అది కూడా చెప్పొచ్చో లేదో అన్న సందేహంలో ఉండగా.. హైపర్ ఆది ఇచ్చిన భరోసాతో ధైర్యంగా చెప్పింది. ఓ డైరెక్టర్ చేసిన నిర్వాకాన్ని అలీ షోలో బయట పెట్టేసింది.

Recommended Video

Anchor Varshini Revealed Secrets & Affairs In Her Life
చేయి పట్టి లాగాడు..

చేయి పట్టి లాగాడు..

చేదు అనుభవం గురించి వర్షిణి చెబుతూ ఇది కరోనా కంటే ముందు జరిగిందని తెలిపింది. ఓ వెబ్ సిరీస్ కోసం డైరెక్టర్ ఆఫీస్ రూంకి పిలిచాడు. స్టోరీ చెప్పాడు. అంతా బాగానే ఉంది. కానీ కొద్ది సేపటికి అతను నా చేయి పట్టి అతనివైపుకు లాగాడు. ఆ ఘటనతో షాక్ అయ్యాను. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను. కారులో ఏడుస్తూనే వెళ్లిపోయాను. ఈ విషయాన్ని నా ఫ్రెండ్స్ ఇద్దరితో మాత్రమే చెప్పుకున్నానని ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X