యాంకర్ రవి దున్నపోతు.. సుధీర్‌నూ వదలకుండా.. యాంకర్ వర్షిణి బోల్డ్ కామెంట్స్
యాంకర్ కాంబినేషన్స్ పై ప్రస్తుతం జనాల్లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ మొదలైంది. గతంలో కేవలం ఒక యాంకర్ మాత్రమే షోలోలో మెరిసేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం జోడి యాంకర్స్ షోలతో హైలెట్ గా నిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో యాంకర్ వర్షిణి కూడా హైపర్ ఆదికి బెస్ట్ పాట్నర్ అనే విధంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రీసెంట్ గా ఆమె యాంకర్ రవి, సుధీర్ పై కొన్ని కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

షూటింగ్స్ కి బ్రేక్..
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా యాంకర్స్ మొత్తం కూడా షూటింగ్స్ కి బ్రేక్ వేశారు. మొన్నటివరకు పలు షోలతో కాస్త బిజీగా ఉన్న వర్షిణి కూడా ఇప్పుడు మళ్ళీ ఇంటికే పరిమితమయ్యింది. ఢీ షోలో ఇటీవల వర్షిణి ఆది చేసిన రొమాంటిక్ డ్యాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.

రవి ఫ్యామిలీతో..
ఆన్లైన్ లో ఒక వెబ్ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితో అలాగే ఇతర యాంకర్స్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి వర్షిణి వివరణ ఇచ్చింది. ముఖ్యంగా రవి ఫ్యామిలీ తనకు క్లోజ్ అంటూ రవి భార్య నిత్యా కూడా తనకు మంచి స్నేహితురాలని చెప్పింది. ఇక రవితో పటాస్ కి ముందు తెలిసినప్పుటికీ అంతగా మాట్లాడుకునేవాళ్ళం కాదని చెప్పింది.

దున్నపోతులా తింటాడు
ఇక రవి ఒక తిండి బోతు.. అతను దున్నపోతులా తింటాడు అని వర్షిణి సరదాగా కామెంట్ చేసింది. ఇక రవి వైఫ్ నిత్య షూటింగ్స్ కి ఎన్నో వెరైటీ వంటకాలు పంపించేది ఆ ఫుడ్ నేను కూడా తినేదాన్ని, రవితో ఎప్పుడైతే లంచ్ లో కూర్చున్ననో ఆ తరువాత చాలా లావయ్యాను. అంత రుచిగా నిత్య వంటలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు నన్ను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు అని వర్షిణి మాట్లాడింది.

ఆ విషయం రవినే అడగండి..
ఇక సుధీర్ తో షో చేయాల్సిన అవకాశం వస్తే.. తప్పకుండా మంచి షో చేస్తాను అని వర్షిణి సమాధానం ఇచ్చింది. ఇక ఇటీవల యాంకర్ రవి హైడ్ అండ్ సిక్ గేమ్ లో అనసూయా, రాహుల్ సిప్లిగంజ్, అలీ రేజా వంటి వారు పాల్గొన్నారు. అందులో మీరు ఎందుకు లేరని యాంకర్ ప్రశ్నించగా ఆ విషయం నాకు తెలియదు రవినే అడగాలని వర్షిణి తెలియజేసింది.


Click it and Unblock the Notifications











