అతడు నా ఫ్యామిలీ.. ప్రేమ ఓకే కానీ పెళ్లి ఇష్టం లేదు: వర్షిణి షాకింగ్ రియాక్షన్
తెలుగు బుల్లితెరపై మహిళా యాంకర్ల హవా కనిపిస్తోంది. టీవీ షోలు.. సినిమా ఫంక్షన్లు.. ప్రముఖులతో ఇంటర్వ్యూలు.. ఇలా ఎక్కడ చూసినా వాళ్లే దర్శనమిస్తున్నారు. అదే సమయంలో సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధ పడుతున్నారు. దీంతో చాలా మంది యాంకర్లుగా కెరీర్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో హాట్ యాంకర్ వర్షిణి ఒకరు. కొన్నేళ్లుగా బుల్లితెరపై తన మార్క్ చూపిస్తున్న ఈ అమ్మడు.. జబర్ధస్త్ కమెడియన్‌తో తనకున్న బంధం గురించి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

చిన్న వయసులోనే మొదలు పెట్టిన వర్షిణి
ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న బిజీ యాంకర్లలో వర్షిణి ఒకరు. ఆకట్టుకునే అందం ఉన్న ఈ అమ్మడు.. చిన్న వయసులోనే మోడలింగ్‌తో కెరీర్‌ను ఆరంభించింది. ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే ‘చందమామ కథలు', ‘బెస్ట్ యాక్టర్స్', ‘లవర్స్', ‘కాయ్ రాజా కాయ్' సహా మరికొన్ని చిత్రాల్లో నటించింది. అయితే, ఆమెకు మంచి గుర్తింపు మాత్రం రాలేదు.

పెళ్లి గోలతో ఫేమస్.. ఢీ కొట్టేందుకు వచ్చింది
సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే వర్షిణి ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రను పోషించింది. ఇందులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' ఫేం అభిజిత్ హీరో. ఇది సూపర్ సక్సెస్ అవడంతో మూడు సీజన్ల పాటు ప్రసారం అయింది. ఆ తర్వాత ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ'లోకి ఆమె ఎంటర్ అయింది. అక్కడ టీమ్ లీడర్‌గా పని చేసింది.

వర్షిణి క్రేజీ మూన్ వాక్.. వరుస ఆఫర్లతో బిజీ
‘ఢీ' షోలో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, ప్రదీప్‌తో కలిసి యాంకర్ వర్షిణి కామెడీని పండించేది. ఆ షోలోనే ఆమె వేసిన మూన్ వాక్ డ్యాన్స్ చాలా రోజుల పాటు హైలైట్ అయింది. ఈ షో తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. దీంతో బిజీ యాంకర్‌గా మారిపోయిందామె. అదే సమయంలో గ్లామర్ షోతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచేసుకుంది.

శ్రీముఖి వెళ్లిపోవడం ఆమెకు కలిసొచ్చింది
ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘పటాస్' షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు రవి, శ్రీముఖి యాంకర్లుగా పని చేసేవారు. అయితే, రాములమ్మ ఆ మధ్య ‘బిగ్ బాస్' షోలోకి వెళ్లడంతో.. వర్షిణికి ‘పటాస్' అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే రవితో కలిసి ఆమె దాన్ని హోస్ట్ చేసింది. ఆ తర్వాత రవి వెళ్లిపోవడంతో చలాకి చంటితో కలిసి పని చేస్తోంది.

జబర్ధస్త్ కమెడియన్లతో ఎఫైర్.. పెళ్లి కూడా
యాంకర్‌గా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోన్న వర్షిణి గురించి కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. వాటిలో ఆమెకు, సుడిగాలి సుధీర్‌కు మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్తతో పాటు హైపర్ ఆదితో వర్షిణి పెళ్లి జరగబోతుందన్న ప్రచారం ప్రధానమైనవి. ఈ రెండు విషయాల గురించి ఆమె ఎన్నోసార్లు సమాధానం దాటవేయడంతో అవి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

అతడు నా ఫ్యామిలీ అంటూ తేల్చేసింది
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది వర్షిణి. ఈ సందర్భంగా ఆమెకు సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. ‘సుధీర్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అతడిని నేను బ్రో బ్రో అని పిలుస్తుంటా. తను కూడా నన్ను బ్రో అంటాడు. బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఉన్న మా ఇద్దరికి పెళ్లి అంటే ఎలాగో అనిపిస్తుంది' అని ఆమె చెప్పుకొచ్చింది.
Recommended Video

ప్రేమ ఓకే కానీ పెళ్లి ఇష్టం లేదంటూ షాకిచ్చింది
అదే ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అన్న ప్రశ్నకు షాకయ్యే విధంగా జవాబిచ్చింది. ‘నాకు పెళ్లి మీద అస్సలు మంచి ఒపీనియన్ లేదు. ప్రేమ వరకు ఓకే కానీ.. పెళ్లి గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు. అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అందుకే ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నాను' అంటూ వర్షిణి వివరించింది.


Click it and Unblock the Notifications











