బ్యాక్‌లెస్ ఫొటోలతో యాంకర్ వర్షిణి హల్‌చల్.. కొంటె చూపుతో కవ్విస్తోందిగా.!

By Manoj

తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది సుందరీమణులు యాంకర్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణను అందుకుంటారు. ఆ కోవలోకే వస్తుంది హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి... యాంకర్‌గా కొనసాగుతోన్న ఈమెకు మాంచి ఫాలోయింగ్ ఉంది. నేచురల్ బ్యూటీగా పేరొందిన వర్షిణికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలాఉండగా, తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఓ హాట్ ఫొటో హైలైట్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.!

మోడలింగ్ కెరీర్ నుంచి సినిమాల్లోకి

మోడలింగ్ కెరీర్ నుంచి సినిమాల్లోకి


ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో వర్షిణి ఒకరు. వరుస షోలతో బిజీ బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ.. వాస్తవానికి మోడలింగ్ రంగంలో మొదట అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్యూటీ ఈవెంట్లలో పోటీ చేసింది. ఈ క్రమంలోనే ‘చందమామ కథలు'తో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది.

పెళ్లి గోలతో పాపులర్.. ఢీ కొడుతోంది

పెళ్లి గోలతో పాపులర్.. ఢీ కొడుతోంది


పలు సినిమాల్లో నటించినప్పటికీ... వర్షిణికి అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా సన్నిగిల్లాయి. అలాంటి సమయంలో ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌ను మార్చేసింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సిరీస్ వల్లే వర్షిణి బాగా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘ఢీ'తో టెలివిజన్ రంగంలోకి అడుగెట్టింది.

పంచుల వర్షం.. డ్యాన్స్‌లో సాటిలేరు

పంచుల వర్షం.. డ్యాన్స్‌లో సాటిలేరు

‘ఢీ' షోలో వర్షిణి ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ షోలో ఆమెపై మిగిలిన వారంతా పంచుల వర్షం కురిపిస్తుంటారు. అయినప్పటికీ ఆమె ఏమాత్రం నిరుత్సాహపడదు. పైగా, చాలా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు, ‘ఢీ' షో వల్ల వర్షిణిలోని డ్యాన్సర్ కూడా బయటకు వచ్చింది. మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసింది.

హైపర్ ఆది, సుధీర్‌తో ప్రేమాయణం

హైపర్ ఆది, సుధీర్‌తో ప్రేమాయణం

బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకు వర్షిణి... జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇక, ఈ మధ్య ఆమె మరో కమెడియన్ హైపర్ ఆదితో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ‘ఢీ'లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడం వల్లే ఈ ప్రచారం మొదలైంది. ఈ రెండింటినీ ఖండిస్తూ ఆమె ప్రకటన వదలిన సంగతి విధితమే.

అక్కడ ఫుల్ బిజీ.. డోసు పెంచేసింది

అక్కడ ఫుల్ బిజీ.. డోసు పెంచేసింది

వరుస షోలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... వర్షిణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టింగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలనూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక, ఈ మధ్య అమ్మడు హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల గ్లామర్ డోస్ పెంచేసి మరీ కొన్ని ఫొటోలు వదిలింది.

బ్యాక్‌లెస్ ఫొటోలతో వర్షిణి హల్‌చల్


ఆకట్టుకునే అందంతో ఎంతో మంది మనసు దోచుకున్న బ్యూటీ వర్షిణి. గ్లామరస్‌గా ఉండడానికి ఇష్టపడే ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో బ్యాక్‌లెస్ ఫొటోలను షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ టాప్‌ను పక్కకు జరిపి మరీ స్కిన్ షో చేసింది. అంతేకాదు, కొంటె చూపుతో యువకుల గుండెకు గాయం చేస్తోంది. దీంతో ఈ ఫొటో కొద్ది సమయంలోనే వైరల్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X